Healthhealth tips in telugu

Dry apricots:రోజుకి 2 తింటే శరీరంలో కొవ్వు కరుగుతుంది…డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది

Dry apricots:రోజుకి 2 తింటే శరీరంలో కొవ్వు కరుగుతుంది…డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.. ఈ మధ్య కాలంలో మారిన పరిస్థితి కారణంగా మనలో చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టి మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నారు.

ఇప్పుడు డ్రై అప్రికాట్ గురించి తెలుసుకుందాం. వీటిని రోజుకి రెండు తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. వీటిల్లో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి.

అందువల్ల మన రక్షణ వ్యవస్థను కాపాడటానికి,శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారు కూడా వీటిని తీసుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మామూలుగా డ్రై ఫ్రూట్స్ లో తీపి శాతం ఎక్కువగా ఉంటుంది. అయితే అప్రికాట్ లో తీపి శాతం మరియు పులుపు కూడా ఉండుట వలన డయాబెటిస్ ఉన్నవారు కూడా తినవచ్చు.

అయితే లిమిట్ గా మాత్రమే తీసుకోవాలి. వీటిలో కేలరీలు మరియు కొవ్వు తక్కువగా ఉంటాయి, అలాగే విటమిన్లు A మరియు C సమృద్దిగా ఉంటాయి. అలాగే బీటా కెరోటిన్, లుటీన్, జియాక్సంతిన్ సమృద్దిగా ఉండుట వలన కంటి ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతుంది. పొటాషియం సమృద్దిగా ఉండుట వలన నరాల సిగ్నలింగ్, కండరాల సంకోచాలు మరియు ద్రవ సమతుల్యతకు సహాయపడుతుంది.

అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. వీటిలో ఉండే ప్రధాన ఫ్లేవనాయిడ్‌లు క్లోరోజెనిక్ ఆమ్లాలు, కాటెచిన్‌లు మరియు క్వెర్సెటిన్ అనేవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.