Healthhealth tips in telugu

Lemon Water:నిమ్మకాయ నీటిని ఏ సమయంలో తాగితే మంచిదో తెలుసా ?

Lemon Water:నిమ్మకాయ నీటిని ఏ సమయంలో తాగితే మంచిదో తెలుసా..ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనలో చాలా మంది ప్రతిరోజు నిమ్మకాయ నీటిని తాగుతున్నారు.

నిమ్మకాయ నీటిని తాగితే అలసట, నీరసం, నిస్సత్తువ వంటివి తొలగిపోయి చురుకుగా హుషారుగా ఉంటారు. మనలో చాలా మంది ఉదయం పరగడుపున నిమ్మకాయ నీటిని తాగుతూ ఉంటారు కొంతమంది రాత్రి సమయంలో తాగుతూ ఉంటారు.

అయితే ఏ సమయంలో తాగితే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం. నిమ్మకాయ నీటిని ఉదయం సమయంలో తాగితే డీహైడ్రేషన్ కి గురికాకుండా శరీరానికి శక్తి లభించి నీరసం, అలసట లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. జీర్ణ ప్రక్రియ వేగవంతం అవుతుంది దాంతో శరీరంలో ఉన్న అనవసరమైన కొవ్వు కరిగిపోతుంది. దాంతో బరువు తగ్గుతారు.

రాత్రి సమయంలో నిమ్మకాయ నీటిని తాగితే మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అధిక బరువు సమస్య తొలగిపోతుంది. శరీరంలో ఏమైనా వాపులు ఉంటే తగ్గిపోతాయి.

కాబట్టి మీకు ఉన్న సమస్యను బట్టి నిమ్మకాయ నీటిని తాగండి. నిమ్మకాయ నీటిని తాగటం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. విటమిన్ సి సమృద్దిగా లభించే నిమ్మకాయ నీటిని తాగి ఆరోగ్యంగా ఉండండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.