Kitchenvantalu

Crispy Spinach Cutlet:క్రిస్పీ క్రిస్పీగా… పాలకూర కట్‌లెట్

Crispy Spinach Cutlet,క్రిస్పీ క్రిస్పీగా… పాలకూర కట్‌లెట్..పాలకూరతో ఎక్కువగా పప్పు చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కట్ లెట్ చేసుకుంటే రుచిగా ఉండటమే కాకుండా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.

కావలసిన పదార్దాలు
పాలకూర – ఒక కప్పు(తరిగినది)
కొత్తిమీర – పావు కప్పు(తరిగినది)
బంగాళాదుంపలు – 11/2 కప్పు(ఉడికించి చిదిమి పెట్టుకోవాలి)
బియ్యప్పిండి – ఒక స్పూన్
పచ్చిమిరప పేస్ట్ – 3 స్పూన్స్
అల్లం,వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూన్
గరం మసాలా – ఒక స్పూన్
రవ్వ – కొద్దిగా
ఉప్పు – సరిపడా
నూనె – సరిపడా

తయారుచేసే విధానం
ఒక బౌల్ తీసుకోని దానిలో పాలకూర,కొత్తిమీర,ఉడికించి చిదిమి పెట్టుకున్న బంగాళాదుంప,బియ్యప్పిండి,పచ్చిమిరప పేస్ట్,అల్లం,వెల్లుల్లి పేస్ట్,గరం మసాలా,ఉప్పు వేసి బాగా కలపాలి. అవసరం అనుకుటే కొంచెం నీరు ఉపయోగించవచ్చు. మరీ పలుచగా,గట్టిగా కాకుండా మధ్యస్థంగా కలపాలి.

మొత్తం మిశ్రమాన్ని మీడియం సైజ్ లో ఉండలుగా చేసుకోవాలి. ఒక్కొక ఉండను అరచేతిలో కొద్దిగా వత్తి కట్ లేట్ లాగా చేసుకోవాలి. వీటిని రవ్వలో దొర్లించి,పెనం మీద కొద్ది కొద్దిగా నూనె వేస్తూ దోరగా కాల్చుకోవాలి. వీటిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి. టమాటా లేదా పుదినా చట్నీ వీటికి మంచి కాంబినేషన్.