Beauty Tips

Hair Care Tips:షాంపూలో ఇది కలిపి రాస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది

Hair Care Tips:షాంపూలో ఇది కలిపి రాస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.. జుట్టు అందంగా,పొడవుగా పెరగటానికి మరియు తెల్లజుట్టు నల్లగా మారటానికి ఖరీదైన ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు. ఈ చిట్కా ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని వేసి ఒక స్పూన్ టీ పొడి వేయాలి. ఆ తర్వాత అర స్పూన్ మెంతులు వేయాలి. .

ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని వడకట్టాలి. ఈ నీరు కాస్త చల్లారాక ఒక స్పూన్ ఆముదం కలపాలి. ఆ తర్వాత దీనిలో షాంపూ కలిపి జుట్టుకి అప్లై చేస్తూ తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. టీ పొడి తలమీద చర్మానికి రక్తప్రవాహాన్ని పెంచి జుట్టు పెరగడానికి ఉద్దీపనగా పనిచేసి జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.

మెంతులు చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఆముదం కూడా రక్త ప్రసరణను పెంచి జుట్టు కుదుళ్లు బలంగా చేస్తుంది. అలాగే జుట్టు తేమను కోల్పోకుండా మృదువుగా మెరిసేలా చేస్తుంది. ఆముదంను పూర్వ కాలం నుండి జుట్టు సంరక్షణలో వాడుతున్నారు. ఇంటి చిట్కాలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి.

ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి ఇప్పుడు చెప్పిన చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త ఓపిక, సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. మెంతులను కూడా పూర్వ కాలం నుండి జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.