Kitchenvantalu

Rava parota:రవ్వ ప‌రోటాలు.. ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ కావాలంటారు..

Rava parota:రవ్వ ప‌రోటాలు.. ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ కావాలంటారు..రవ్వ పరోటా” దూదిలా మెత్తగా, వెన్నలా కరిగిపోతాయ్! బొంబాయి రవ్వతో ఎప్పుడూ ఉప్మానే కాదండి పొద్దున్నే టిఫిన్ కి లేదా పిల్లల లంచ్ బాక్స్ కి ఇది చేస్తే చాలా బాగుంటుంది.

కావలసిన పదార్ధాలు : రవ్వ – ఒక కప్పు, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా, గోధుమపిండి – అరకప్పు, కారం – అర టీస్పూన్‌, జీలకర్రపొడి – అర టీస్పూన్‌, పచ్చిమిర్చి – రెండు, కొత్తిమీర – ఒక కట్ట, వాము – పావు టీస్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్టు – ఒక టీస్పూన్‌.

తయారీవిధానం
స్టవ్ వెలిగించి పాన్ పెట్టి రెండు కప్పుల నీటిని పోసి ఒక స్పూన్ నూనె సరిపడా ఉప్పు వేసి బాగా మరిగించాలి. నీళ్లు బాగా మరిగాక రవ్వ పోసి బాగా కలిపి ఉడికాక ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి.

ఈ మిశ్రమంలో లో అర కప్పు గోధుమపిండి అర స్పూన్ కారం అర స్పూన్ జీలకర్ర పొడి వాము సన్నగా తరిగిన కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ముక్కలు తగినంత ఉప్పు వేసి బాగా అన్ని కలిసేలా బాగా కలపాలి. ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని ఒక ముద్ద చపాతీలా వత్తుకుని పెనం మీద కాల్చుకుంటే రవ్వ పరోటా రెడీ.