Kitchenvantalu

Tomato Pepper Rasam:టమాటో మిరియాల రసం.. అదిరిపోయే రుచితో జలుబు, దగ్గులకి మంచి ఉపశమనం

Tomato Pepper Rasam:టమాటో మిరియాల రసం.. అదిరిపోయే రుచితో జలుబు, దగ్గులకి మంచి ఉపశమనం..ఈ రసం చేయటం చాలా సులువు. అన్నంలోకి చాలా బాగుంటుంది.

కావలసిన వస్తువులు: టొమాటోలు – మూడు, మిరియాల పొడి – ఒక టీస్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు – నాలుగైదు, అల్లం ముక్క – చిన్నది, దాల్చిన చెక్క – చిన్నది, ఉల్లిపాయ – ఒకటి, నూనె – ఒక టీస్పూన్‌, పుదీనా – కొద్దిగా.

తయారి విధానం : ఒక గిన్నెలో ఒక కప్పు నీటిని పోసి సన్నగా తరిగిన టమాటా ముక్కలు చిన్న అల్లం ముక్క దాల్చిన చెక్క లేదా దాల్చిన చెక్క పొడి మిరియాల పొడి వేసి బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్ గా తయారు చేయాలి.

ఈ పేస్ట్ ని పక్కన పెట్టుకోవాలి పాన్ లో నూనె వేసి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి ఆ తర్వాత టొమాటో పేస్ట్ వేసి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. సిమ్ లో పెట్టి ఉడికించాలి దీనిలో కాస్త నీటిని పోసి రసంలా వచ్చేలాగా మరిగించుకోవాలి అంతే టమాటో మిరియాల రసం రెడీ.