Kitchenvantalu

Dry Fruit Laddu:ఇలా లడ్డు చేసుకోండి.. తింటే ఆరోగ్యంతో పాటు బలంగా, పుష్టి గా ఉంటారు

Dry Fruit Laddu;ఇలా లడ్డు చేసుకోండి.. తింటే ఆరోగ్యంతో పాటు బలంగా, పుష్టి గా ఉంటారు.. ప్రతి రోజు ఒక లడ్డు తింటే ఎన్నో సమస్యల నుండి బయట పడవచ్చు. ఈ లడ్డును పిల్లల నుండి పెద్దవారి వరకు తినవచ్చు.

కావలసిన పదార్దాలు
బెల్లం తురుము – ఒక కప్పు
ఎండు కొబ్బరి తురుము – అరకప్పు
నీరు – అరకప్పు
నెయ్యి – ఒక స్పూన్
జాజికాయ పొడి – అర స్పూన్
యాలకుల పొడి – అర స్పూన్
ఖర్జూర ముక్కలు – ఒక స్పూన్
కిస్మిస్లు – ఒక స్పూన్
జీడిపప్పు – రెండు స్పూన్స్
వాల్ నట్స్ ముక్కలు – రెండు స్పూన్స్
బాదం ముక్కలు – రెండు స్పూన్స్
పప్పీ సీడ్స్ – రెండు స్పూన్స్
ఎడిబుల్ గమ్ – ఒక స్పూన్

తయారీ విధానం
బాండి లేదా మందపాటి గిన్నెలో నెయ్యి వేసి ఎండు కొబ్బరి తురుమును దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో ఎడిబుల్ గమ్ వేసి బబుల్స్ వచ్చే వరకు ఉంచాలి. తర్వాత దీన్ని స్పూన్ తో తీసి పక్కన పెట్టాలి. ఇంకా మిగిలిన నెయ్యిలో ఖర్జూర ముక్కలు, జీడిపప్పు,వాల్ నట్స్ ముక్కలు,బాదం ముక్కలు వేసి దోరగా వేయించాలి.

చివరగా పప్పీ సీడ్స్ వేసి జతచేయాలి. దించే ముందు కిస్మిస్ వేయాలి. ఇప్పుడు వేరే గిన్నెలో నీటిని వేడి చేసి అందులో బెల్లం తురుము వేయాలి. పాకం వచ్చేవరకు వేడి చేయాలి. ఉండ పాకం వచ్చిన తర్వాత దింపి జాజికాయ పొడి,యాలకుల పొడి వేసి అనంతరం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ను కలపాలి. వేడి చల్లారకుండా లడ్డులుగా చేసుకోవాలి.