Kitchenvantalu

Badam Sharbat Recipe:వేసవి తాపం తీర్చే బాదం షర్బత్

Badam Sharbat Recipe:వేసవి తాపం తీర్చే బాదం షర్బత్.. వేసవి కాలంలో అన్నీ చల్లచల్లగా, జ్యూసుల్లాంటివే తాగాలని అనిపిస్తుంది. ఎండలో ఇంటికొచ్చేసరికి చల్లని జ్యూసు, షర్బత్ తాగితే ఆ హాయే వేరు. జ్యూసు దాహాన్నా తీర్చదిలానూ, శక్తిని ఇచ్చేదిలా కూడా ఉంటే చాలా మంచిది. అందుకే బాదం షర్బత్ తయారి గురించి తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:
బాదం పప్పు : 1 కప్పు
ఆకు పచ్చని యాలకులు :6 -7
మిరియాలు : 1 చిన్న చెంచా
చక్కెర : 2 కప్పులు
నీళ్లు : ౩ కప్పులు
బాదం ఎసెన్స్ : 2చుక్కలు

తయారి విధానం :
బాదం పప్పును రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మర్నాడు ఉదయం బాదం పప్పు కి మిరియాలు, యాలకులు చేర్చి మెత్తగా గ్రెండ్ చేయాలి. నీళ్ళలో చక్కెర వేసి కరిగాక వడకట్టాలి. స్టవ్ మీద పెట్టి తీగ పాకం వచ్చే దాక మరిగించాలి.

గ్రెండ్ చేసిన మిశ్రమాన్ని ఈ పాకానికి చేర్చి రెండు మూడు పొంగులు వచ్చే దాక వేడి చేయాలి. చల్లారిన తర్వాత బాదం ఎసెన్స్ కలిపి బాటిల్స్ లో నింపి పెట్టుకోవాలి. చల్లని పాలు కలిపి తాగాలి.