Kitchenvantalu

Pudina Juice:పుదీనా జ్యూస్..వేసవిలో తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు…

Pudina Juice:పుదీనా జ్యూస్..వేసవిలో తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు… అసలే తీవ్రమైన ఎండలు, వాటికి తోడు వేడి గాలులు… వడ దెబ్బ తగిలే అవకాశాలు సమ్మర్‌లో చాలా ఎక్కువ. కాబట్టి ఇలాంటి సమయంలో పుదీనా జ్యూస్ వంటివి తాగాలి.

కావలసిన పదార్థాలు
పుదీనా – ఒక కట్ట
జీలకర్ర పొడి – ఒక టీ స్పూను
సోంపు పొడి- ఒక టీ స్పూను
వాము పొడి – అర టీ స్పూను
మిరియాల పొడి – ఒక టీ స్పూను
నిమ్మకాయ రసం – రెండు చెక్కలు
ఉప్పు – తగినంత
నీళ్లు – ఒక లీటరు

తయారుచేసే విధానం
ముందుగా పుదీనా ఆకుల్ని శుభ్రంగా కడిగి వాటిని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ ముద్దను నీటిలో కలిపి అందులో జీలకర్ర పొడి, సోంపు పొడి, వాము పొడి, మిరియాల పొడి, నిమ్మకాయ రసం, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన రసాన్ని కుండలో పోసుకుని మనకి అవసరం అయినప్పుడు త్రాగితే చాలా బాగుంటుంది.