Healthhealth tips in telugu

Weight Loss:బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకుంటే బరువు తగ్గటమే కాకుండా మరెన్నో ప్రయోజనాలు

Weight Loss:బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకుంటే బరువు తగ్గటమే కాకుండా మరెన్నో ప్రయోజనాలు.. ఈ రోజుల్లో అధిక బరువు అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి.

అధిక బరువు సమస్యను తగ్గించుకోవటానికి మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సహజసిద్దంగా బరువు తగ్గే విధానంలోకి వెళ్ళాలి.

ఒక బౌల్ 4 స్పూన్ల ఒట్స్ వేసి నీటిని పోసి 15 నిమిషాలు నానబెట్టాలి. ఒక ఆపిల్ శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. రెండు ఖర్జూరాలను గింజలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మిక్సీ జార్ లో ఆపిల్ ముక్కలు, ఖర్జూరం ముక్కలు, నానబెట్టిన ఒట్స్ వేయాలి.

ఆ తర్వాత అరస్పూన్ దాల్చినచెక్క పొడి, అరస్పూన్ గుమ్మడి గింజలు,అరస్పూన్ ఆవిసే గింజలు, అరస్పూన్ సన్ ఫ్లవర్ గింజలు వేయాలి. ఆ తర్వాత 200 Ml పాలను పోసి మిక్సీ చేసి గ్లాసులో పోసి సర్వ్ చేయటమే. ఈ జ్యూస్ ని ప్రతి రోజు ఉదయం సమయంలో తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

ఈ జ్యూస్ ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. నీరసం,అలసట లేకుండా హుషారుగా ఉంటారు. అంతేకాక శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆపిల్,ఖర్జూరం లో ఉన్న పోషకాలు నీరసం రాకుండా బరువును తగ్గించటానికి సహాయపడతాయి.

ఇక ఒట్స్ విషయానికి వస్తే ఒట్స్ లో ఉన్న పోషకాలు బరువు తగ్గటానికి సహాయపడతాయి. అలాగే దాల్చినచెక్కలో ఉన్న సమ్మేళనాలు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించి చాలా త్వరగా బరువు తగ్గటానికి సహాయపడతాయి. కాబట్టి కాస్త ఓపికగా ఈ జ్యూస్ తయారుచేసుకొని తాగి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.