Kitchenvantalu

Protein Pulao Recipe:బరువు తగ్గాలనుకుంటే.. ప్రొటీన్ పులావ్ ఎలా తయారు చేయాలి? ఈజీగా.. టేస్టీగా

Protein Pulao Recipe:బరువు తగ్గాలనుకుంటే.. ప్రొటీన్ పులావ్ ఎలా తయారు చేయాలి? ఈజీగా.. టేస్టీగా.. ఈ మధ్య కాలంలో బరువు అనేది సాదారణమైన సమస్య అయ్యిపోయింది.

కావలసినవి:
బాస్మతి బియ్యం – 120 గ్రా
ఎండు బఠాణీ – 20 గ్రా
రాజ్మా – 20 గ్రా
సోయాబీన్స్ – 20 గ్రా
క్యారట్ తరుగు – 40గ్రా
ఉల్లితరుగు – కప్పు
టొమాటోలు – 3
ఉప్పు – తగినంత
నూనె – 4 టేబుల్ స్పూన్లు
కరివేపాకు – రెండు రెమ్మలు

పేస్ట్ కోసం:
అల్లం ముక్క – చిన్నది
పచ్చిమిర్చి – 4
వెల్లుల్లి రేకలు – 6
కొత్తిమీర – చిన్న కట్ట
లవంగాలు – 2
ఏలకులు – 2
దాల్చినచెక్క – చిన్న ముక్క
షాజీరా – టీ స్పూను
పసుపు – కొద్దిగా

తయారి:
ముందుగా మసాలా పేస్ట్ తయారుచేసుకొని పక్కన పెట్టాలి. దాని కోసం అల్లం ముక్క,పసుపు,పచ్చిమిర్చి,వెల్లుల్లి రేకలు, కొత్తిమీర, లవంగాలు, ఏలకులు, దాల్చినచెక్క, షాజీరా అన్నింటిని కలిపి మెత్తగా పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఎండు బఠాణీ,రాజ్మా,సోయాబీన్స్,బియ్యం…. వీటిని విడివిడిగా రెండు గంటల పాటు నానబెట్టాలి.

ఆ తర్వాత నీటిని వంపేయాలి. పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోసి అది వేడి ఎక్కాక ఉల్లి తరుగు వేసి వేయించాలి.ఇది కొంచెం వేగాక టొమాటో తరుగు,క్యారట్ తరుగు, మసాలా పేస్ట్, పసుపు వేసి బాగా కలపాలి.

కలిపిన తర్వాత నానబెట్టుకున్న బఠాణీ,రాజ్మా,సోయాబీన్స్,బియ్యం,ఉప్పు,కరివేపాకు వేసి బాగా కలిపి తగినంత నీరు పోసి కుక్కర్ లో పెట్టి మూడు విజిల్స్ వచ్చాక తక్కువ మంటలో ఐదు నిముషాలు ఉంచాలి. అంతే అందరికి నచ్చే ప్రొటీన్ పులావ్ రెడీ. దీనిని అప్పడం, రైతాలతో సర్వ్ చేయాలి.