Healthhealth tips in telugu

Watermelon: పుచ్చకాయ ఎర్రగా పండిదో లేదో.. కోయకుండానే ఎలా తెలుసుకోవాలి…

Watermelon: పుచ్చకాయ ఎర్రగా పండిదో లేదో.. కోయకుండానే ఎలా తెలుసుకోవాలి… ఒకప్పుడు పుచ్చకాయ అంటే వేసవిలో మాత్రమే దొరికేవి. కానీ ప్రస్తుతం అన్ని సీజన్స్ లోను పుచ్చకాయలు దొరుకుతున్నాయి. అయితే వేసవిలో లభించే పుచ్చకాయలకే రుచి,నాణ్యత ఎక్కువగా ఉంటుంది.పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండాకాలంలో తినటం వలన శరీరంలో వేడిని తగ్గించి చలువ చేస్తుంది.

వేసవిలో కలిగే వేడి,తాపం తీర్చటానికి పుచ్చకాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రోజుల్లో మార్కెట్ లో రకరకాల పుచ్చకాయలు లభ్యం అవుతున్నాయి. పుచ్చకాయ కొనుక్కొని రెండు రోజుల తర్వాత తిందామంటే కుదరదు. పుచ్చకాయ లోపల ఎర్రగా ఉందో లేదో చూడటానికి కొస్తే తొందరగా తినేయాలి. లెట్ అయ్యితే పాడై కుళ్లు వాసన వస్తుంది.

అయితే పుచ్చకాయ కోయకుండా లోపల ఎర్రగా ఉన్నదాన్ని ఎంచుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పుచ్చకాయ బరువు రెండు కేజీలు కన్నా ఎక్కువ ఉండాలి. పుచ్చకాయ ఏ రంగులో ఉన్నా పర్వాలేదు. అలాగే చారలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు. పుచ్చకాయ తోడిమి ఎండి ఉండాలి. పుచ్చకాయ గట్టిగా బరువుగా ఉండాలి. మెత్తగా బరువు తక్కువగా ఉంటే లోపల పాడయినట్టే.

కొన్ని పుచ్చకాయలపై చారాలతో సంబంధం లేకుండా గోధుమ లేదా పసుపు రంగు మచ్చలుంటాయి. ఆ మచ్చలు దాదాపుగా గుండ్రంగా ఉంటాయి. మచ్చలు ఎన్ని ఎక్కువ ఉంటే పుచ్చకాయ లోపల అంత ఎర్రగా ఉన్నట్టు. ఒక్కో పుచ్చకాయకు ఒకటే మచ్చ ఉంటుంది. కొన్నింటికి రెండు మూడు మచ్చలు ఉంటాయి.

పుచ్చకాయ ఎంత ఎర్రగా ఉంటే అంత ఎక్కువగా అందులో పోషకాలు ఉంటాయి. కాబట్టి మచ్చలుండే గట్టి పుచ్చకాయను ఎంచుకొని, తొడిమ ప్రాంతం ఎండిందో లేదో చూసి కొనుక్కోండి. అప్పుడు దాన్ని కట్ చెయ్యకపోయినా లోపల ఎర్రగానే ఉంటుందని పరిశోధకులు తేల్చారు. కట్ చెయ్యని పుచ్చకాయని ఇంట్లో (ఫ్రిడ్జ్‌లో లేదా ఎండ తగలని చోట) ఓ రెండ్రోజులు ఉంచినా పాడవదు.

పుచ్చకాయలో బి విటమిన్లు, పొటాషియం,ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా ఉంటాయి. బి విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే.. పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. వడదెబ్బ బారినపడి శరీరం నిస్తేజం అయిపోకుండా కాపాడుతుంది. వేడికి కమిలిన చర్మానికి చల్లని పుచ్చకాయ గుజ్జును రాస్తే తిరిగి చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

వంద గ్రాముల పుచ్చకాయల ముక్కల నుంచి 30 కెలోరీలు మాత్రమే అందుతాయి. రక్త పోటు ఉన్నవారు పుచ్చకాయ తింటే ఎంతో మేలు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం లు రక్తపోటును అదుపు చేస్తాయి.

పుచ్చకాయలలోని వ్యాధినిరోధక శక్తిని పెంచే బీటా కెరొటిన్, విటమిన్ బి, సి, లతో పాటు శరీర పనితీరుకు అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాసియం, అయోడిన్‌లు ఎక్కువగా ఉన్నాయి. అధిక రక్తపోటుతో బాధపడే వారికి పుచ్చకాయ చాలా మేలు చేస్తుంది. ఇందులోని అమినో ఆమ్లాలు గుండెకు సంబంధించిన కండరాలని సడలించి రక్త సరఫరా సక్రమంగా అయ్యేట్లు చేస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.