Healthhealth tips in telugu

Remedies for Sweating: చెమట దుర్వాసనతో చిరాకు వస్తోందా.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే సరి…!

Remedies for Sweating: చెమట దుర్వాసనతో చిరాకు వస్తోందా.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే సరి.. మనలో చాలా మంది చెమట వాసనతో చాలా ఇబ్బంది పడుతుంటారు. కొంతమందికి వేసవి కాలంలో మాత్రమే ఈ సమస్య ఉంటుంది.

మరి కొంతమందికి వేసవి కాలం లోనే కాకుండా చలి కాలంలో కూడా విపరీతంగా చెమటలు పడుతూ ఉంటాయి. చెమట వాసన పోవటానికి పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఇంటి చిట్కాలతో సులభంగా తగ్గించుకోవచ్చు.

చాలా మంది ఖరీదైన కాస్మోటిక్స్ వాడుతూ ఉంటారు. అలా వాడవలసిన అవసరం లేదు. కాస్త ఓపికగా ప్రయత్నిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చెమట వాసన నుండి బయట పడవచ్చు. చెమట రావడం వలన ఎటువంటి నష్టమూ లేదు. కానీ చెమట కారణంగా వచ్చే దుర్వాసన పక్కన వారిని కూడా ఇబ్బంది .పెడుతుంది. ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే చెమట వాసన నుండి బయటపడవచ్చు.

నిమ్మరసం చెమట వాసనను తొలగించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. స్నానం చేసే నీటిలో అర చెక్క నిమ్మరసం కలిపి చేస్తే చెమట వాసన కు చెక్ పెట్టవచ్చు. అలాగే యాంటీబ్యాక్టీరియల్ సోపు ని వాడుతూ ఉండాలి. బాగా వాసన వచ్చే పౌడర్ మరియు మాయిశ్చరైజర్ వంటి వాడకాన్ని తగ్గించాలి. .

అలాగే చెమట వాసన తగ్గడానికి గ్రీన్ టీ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. స్నానం చేసే నీటిలో గ్రీన్ టీ వేసుకుని స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా .చెమట వాసన అనేది ఉంటుంది.

కాబట్టి తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. అంటే మసాలా వంటకాలు, ఆల్కహాల్, రెడ్ మీట్ వంటి వాటికి కాస్త దూరంగా ఉండాలి. ఇలా ఆహారంలో మార్పులు చేసుకుంటూ ఇప్పుడు చెప్పిన చిట్కాలు పాటిస్తే చాలా సులభంగా చెమట వాసన నుండి బయట పడవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.