Beauty Tips

Face Glow Tips:ఫంక్షన్ కి వెళ్ళే 10 నిమిషాల ముందు ఇలా చేస్తే ముఖం తెల్లగా,కాంతివంతంగా మెరుస్తుంది

Face Glow Tips:ఫంక్షన్ కి వెళ్ళే 10 నిమిషాల ముందు ఇలా చేస్తే ముఖం తెల్లగా,కాంతివంతంగా మెరుస్తుంది..ఫంక్షన్ కి వెళ్లినప్పుడు ముఖం తెల్లగా కాంతివంతంగా మెరవాలంటే బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగవలసిన అవసరం లేదు.

వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మన ఇంటిలో ఉన్న సహజసిద్దమైన పదార్ధాలతో ముఖాన్ని తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు. ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది.

దీని కోసం ఒక బౌల్ లో ఒక స్పూన్ గంధం పొడి, ఒక స్పూన్ ఆలోవెరా జెల్, ఒక స్పూన్ పాలను పోసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి పది నిమిషాలు అయ్యాక ముఖం మీద నీటిని చల్లి ముఖాన్ని రబ్ చేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా చేస్తే కేవలం పది నిమిషాల్లోనే ముఖం తెల్లగా,కాంతివంతంగా మెరుస్తుంది. గంధంలో తేలికపాటి ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలు ఉండుట వలన చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఇది మీ చర్మంపై నల్ల మచ్చలను పోగొట్టడానికి సహాయపడుతుంది. టాన్ తొలగించడానికి చాలా సమర్థ వంతముగా పనిచేస్తుంది.

ఆలోవెరా చర్మంలో మృత కణాలను తొలగించి ముఖం మెరిసేలా చేస్తుంది. పాలల్లో ఉన్న లక్షణాలు ముఖం మీద చర్మానికి పోషణ అందిస్తుంది. ఈ ప్యాక్ అన్నీ చర్మ తత్వాలకు సెట్ అవుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."