Kitchenvantalu

Phool Makhana Gravy Curry:జీడిపప్పుతో ఫుల్ మఖాన మసాలా కర్రీ.. అన్నం,చపాతీలోకి చాలా రుచిగా..

Phool Makhana Gravy Curry:జీడిపప్పుతో ఫుల్ మఖాన మసాలా కర్రీ.. అన్నం,చపాతీలోకి చాలా రుచిగా.. ఎంతో హెల్తీ అయి జీడిపప్పులను అలంకరణ కోసం,స్వీట్స్,గ్రేవీస్ కోసం కొద్ది కొద్దీ వాడుతుంటాం.అదే జీడిపప్పులతో కాజు మఖనా గ్రేవీ కర్రీ అదిరిపోతుంది.అచ్చం పెళ్లిల్లలో చేసినట్టే రావాలంటే ఇలా చేసేయండి.

కావాల్సిన పదార్ధాలు
జీడిపప్పులు- 75 గ్రాములు
పూల్ మఖానా – 1 కప్పు
గ్రేవీ కోసం..
నూనె – 4 టేబుల్ స్పూన్స్
అల్లం – 1 ఇంచ్
వెల్లుల్లి -7-8
ఉల్లిపాయ -1 కప్పు
ఎండుకొబ్బరి – ¼ కప్పు
పచ్చిమిర్చి – 4-5
మిరియాలు – ¼ కప్పు
గసగసాలు – 1 టేబుల్ స్పూన్
టమాటో – 2
పెరుగు -1/2 కప్పు

కర్రీ కోసం..
నూనె – 2 టేబుల్ స్పూన్
పసుపు – ¼ టీ స్పూన్
ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి – 1/4టీ స్పూన్
నీళ్లు – 1.5 కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
నెయ్యి – 1 టీస్పూన్
కొత్తిమీర – కొద్దిగా

తయరీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేసి అందులో జీడిపప్పులు వేసి ఎర్రగా వేపుకోని పక్కన పెట్టి,మఖానా కూడ కరకరలాడేలా వేపి తీసుకోవాలి.
2.గ్రేవీ కోసం మరో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులోకి మసాలా దినుసులు,ఉల్లి,పచ్చిమిర్చి తరుగు ,కొబ్బరి వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి.
3.వేగిన ఉల్లిపాయ లో గసగసాలు వేసి అందులోకి టమాటో ముక్కలు వేసి మెత్తపడే వరకు మగ్గనివ్వాలి.
4.మగ్గిన టమాట మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసుకోని అందులోకి పెరుగు,నీళ్లు వేసి క్రీమ్ లాగ గ్రైండ్ చేసుకోవాలి.

5. కర్రీ కోసం ఉంచిన నూనే వేసుకోని అందులో పసుపు,ధనియాల పొడి,జీలకర్ర పొడి కొద్దిగా నీళ్లు వేసి వేపుకోవాలి.
6.వేగిన మసాలాల్లో గ్రైండ్ చేసుకున్న మసాల పేస్ట్ ,నీళ్లు ,ఉప్పు వేసి కలుపుకోని మూతపెట్టి నూనె పైకి తేలేవరకు కలుపుతూ దగ్గరపడనివ్వాలి.
7.చిక్కపడుతున్న గ్రేవిలోకి జీడిప్పు, మఖానా కొత్తిమీర ,నెయ్యి వేసి కలుపుకోని మరో 2 నిమిషాలు ఉడికించి స్టవ్ఆఫ్ చేసుకోవాలి.
8.అంతే కాజు మఖానా కర్రీ తయారైనట్టే.