Kitchenvantalu

Karam Panasa Thonalu:సాయంకాలం ఇలా వేడి వేడిగా స్నాక్స్ చేసుకుని తినండి.. రుచిగా ఉంటాయి..!

Karam Panasa Thonalu:సాయంకాలం ఇలా వేడి వేడిగా స్నాక్స్ చేసుకుని తినండి.. రుచిగా ఉంటాయి.. ఈవినింగ్ పిల్లల స్నాక్స్ కోసం,టీ లోకి కాంబినేషన్స్ కోసం చూస్తున్నారా. అయితే ఈ కారం తొనలు చేసి పెట్టుకోండి.పర్ ఫెక్ట్ గా ఉంటాయి.

కావాల్సిన పదార్ధాలు
పిండి కలుపుకోవడానికి..
మైదా – 250 గ్రాములు
నెయ్యి – 50 ml
ఉప్పు – 1టేబుల్ స్పూన్
నీళ్లు – సరిపడా
నూనె – ఫ్రై కి సరిపడా
కారం పొడి కోసం..
కారం – ½ కప్పు
నల్ల ఉప్పు – ¼ కప్పు

తయారీ విధానం
1.జల్లించిన మైదా పిండిలో నెయ్యి ,ఉప్పు వేసి పొడి పొడి గా నీళ్లు కలపకుండా కలుపుకోవాలి.
2.ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుంటు పిండిని గట్టిగా కలుపుకోవాలి.
3.కలిపిన పిండి పై నెయ్యి రాసి పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
4.పది నిమిషాల తర్వాత పొడి పిండి చల్లుకోని పూరీలల చపాతి కర్రతో తాల్చుకోవాలి.

5.పలుచగా వత్తుకున్న పిండిని చతురస్రాకారంలో కట్ చేసుకోవాలి.
6.తరువాత చతురస్రాకారం లో చుట్టు అంచులకి ¼ ఇంచ్ వదిలేసి మధ్యన 4-5 గాట్లు పెట్టుకోవాలి.
7.ఆ తర్వాత అంచులని గట్టిగా నొక్కుతూ లోపలికి రోల్ చేసుకోవాలి.
8.ఇప్పుడు బాగా వేడెక్కిన ఆయిల్ లో తయారు చేసుకున్న తొనలను వేసి మీడియం ఫ్లేమ్ పై కాల్చుకోవాలి.
9.తర్వాత హై ఫ్లేమ్ లో ఎర్రగా వేపుకోని జల్లెడలోకి తీసుకోవాలి.
10.కారం ,నల్ల కారం ,ఉప్పు కలిపి వేడి వేడి తొనలని ఎగరేస్తు చల్లుకోవాలి.