Healthhealth tips in telugu

Tulsi Leaves: వామ్మో.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి ఆకులను నమిలితే ఇన్ని ప్రయోజనాలా..

Tulsi Leaves: వామ్మో.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి ఆకులను నమిలితే ఇన్ని ప్రయోజనాలా.. తులసి చెట్టు దాదాపుగా ప్రతి ఇంటిలోనూ ఉంటుంది. అయితే ఆ ఆకులలో ఉండే ప్రయోజనాల గురించి పెద్దగా తెలియక కేవలం పూజించే మొక్కగానే భావిస్తారు.

తులసిని పవిత్రమైన చెట్టుగా భావించి పూజ చేస్తూ ఉంటారు. తులసి ఆకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కానీ మనలో చాలా మందికి ఈ విషయం తెలియదు. తులసి ఆకులలో విటమిన్ ఏ. విటమిన్ సి, కె, కాల్షియం,మెగ్నీషియం,ఫాస్ఫరస్, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు, ఫైబర్ ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి.

తులసిలో ఉండే విటమిన్ సి, జింక్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి అలాగే యాంటీ బాక్టీరియల్ యాంటీ వైరల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయి దగ్గు జలుబు శ్వాసకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది తులసి ఆకుల రసంలో కొంచెం తేనె కలుపుకుని తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది

తులసిలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ బి అనేవి ఒత్తిడిని తగ్గిస్తాయి మెదడులోని సెరటోనిన్ మరియు డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్ మీటర్లను సమతుల్యం చేసి ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది. .

తులసి ఆకుల రసం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్న వారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. అజీర్ణం,గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఆకలి లేని వారికి ఆకలిని పుట్టిస్తుంది. ప్రతిరోజు 4 లేదా 5 తులసి ఆకులను పరగడుపున నమిలితే సరిపోతుంది. ఉదయం పరగడుపున తినటం కుదరనివారు రోజులో ఏ సమయంలోనైనా తినవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.