Healthhealth tips in telugu

Ajwain water:ఈ నీరు అమృతం కన్నా ఎక్కువే.. ఉదయాన్నే ఒక్క గ్లాసు తాగారంటే.. అమేజింగ్ బెనిఫిట్స్

Ajwain water:ఈ నీరు అమృతం కన్నా ఎక్కువే.. ఉదయాన్నే ఒక్క గ్లాసు తాగారంటే.. అమేజింగ్ బెనిఫిట్స్.. వామును ప్రతి రోజు వాడుతూనే ఉంటాం. వాము ఎన్నో సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది. మన వంటింట్లో ఉండే వాములో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మన పూర్వీకులు ఆరోగ్య ప్రయోజనాల కోసం వామును ఎక్కువగా ఉపయోగించేవారు. అలాగే ఆయుర్వేదం లో కూడా ఎక్కువగా వాముని వాడుతూ ఉంటారు.

వాము నీటిని తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయి తెలుసుకుందాం. ముందుగా వాము నీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వాము ఒక స్పూన్ తీసుకుని దోరగా వేగించి ఒక గ్లాసులో వేసి దానిలో నీటిని పోసి రాత్రంతా అలా వదిలేయాలి మరుసటి రోజు ఆ నీటిని మరిగించి వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.

ఈ విధంగా తాగటం వలన గ్యాస్, కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తొలగిపోతాయి. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి కొవ్వుగా మారకుండా శక్తిగా మారేలా చేస్తుంది దాంతో బరువు తగ్గుతారు. వాములో ఉండే థైమోల్ కడుపులో గ్యాస్ట్రిక్ రసాలను ఉత్పత్తి చేసి జీర్ణ ప్రక్రియ బాగా జరిగేలా ప్రోత్సహిస్తుంది.

గర్భదరణ సమయంలో వచ్చే మలబద్దకం సమస్యను కూడా నివారిస్తుంది. దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి వాటిని తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. దీని కోసం పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి కాస్త వేడి అయ్యాక అరస్పూన్ వాము, 4 తులసి ఆకులను వేసి 5 నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని వడకట్టి తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.

వాములో థైమాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది చర్మ సౌందర్యానికి కూడా సహాయం చేస్తుంది. చర్మంపై దురద లేదా.. దద్దుర్లు వస్తుంటే.. ఆ ప్రాంతంలో.. వాము ని నూరి ఆ పొడిలో నీటిని కలిపి ఆ ప్రాంతంలో రాయాలి. ఇలా రాయడం వల్ల ఆ సమస్య తగ్గుమఖం పడుతుంది. అంతేకాక జుట్టు రాలే సమస్యను తగ్గించటానికి కూడా సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.