Healthhealth tips in telugu

Betel Leaf:తమలపాకు, తులసి గింజలను కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..? లాభాలు తెలిస్తే..

Betel Leaf:తమలపాకు, తులసి గింజలను కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..? లాభాలు తెలిస్తే.. మనలో చాలా మందికి తమలపాకు తినే అలవాటు ఉంటుంది. తమలపాకులోని ఆస్ట్రింజెంట్ ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. తమలపాకు,తులసి గింజలను కలిపి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. తులసి గింజలను తులసి చెట్టు నుండి సేకరించవచ్చు.

తులసి గింజలు ఆయుర్వేదం షాప్ లలో కూడా లభ్యం అవుతాయి. అర గ్లాసు నీటిలో పావు స్పూన్ తులసి గింజలను వేసి రెండు గంటల పాటు నానబెడితే ఆ గింజలు జెల్లీలా ఉబ్బుతాయి. ఈ మిశ్రమంలో ఒక తమలపాకును రసంగా తీసుకొని కలపాలి. ఈ మిశ్రమంను వారంలో మూడు రోజులు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

జీర్ణప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది. లాలాజల గ్రంథిని చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ గ్రంథి ఆహారాన్ని చిన్న ముక్కలుగా విడగొట్టడానికి సహాయపడి…తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి మలబద్ధకం, అజీర్ణం మరియు గ్యాస్, గ్యాస్ట్రిక్ అల్సర్ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. మన శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉంటే ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. ఈ సీజన్ లో వచ్చే జలుబు,ఫ్లూ,గొంతు నొప్పి మరియు కఫం వంటి వాటిని తగ్గిస్తుంది. అలాగే తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చిగుళ్ళ వాపును తగ్గిస్తాయి. నోటి దుర్వాసన లేదా చిగుళ్ళ నుండి రక్తం రావడం వంటి సమస్యలను తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. శారీరక బలహీనత లేకుండా చేస్తుంది. కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చుతో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.