Kitchenvantalu

Punjabi style Aloo Methi curry:ఆలూ మేతి మసాలా కర్రీ అన్నం,చపాతీ పులావ్ లోకి సూపర్ గా తినేయచ్చు

Punjabi style Aloo Methi curry:ఆలూ మేతి మసాలా కర్రీ అన్నం,చపాతీ పులావ్ లోకి సూపర్ గా తినేయచ్చు.. ఎన్ని రకాల వంటలు చేసాము అన్నది కాదు, ఎంత నచ్చేలా చేసాము అన్నది ముఖ్యం. చేసింది ఒకే వంటకం అయినా, పర్ఫెక్ట్ చేస్తే, మరో వంట గురించి,ఆలోచించనే ఆలోచించం.

కావాల్సిన పదార్ధాలు
బంగాళ దుంపులు – 300 గ్రాములు
పసుపు – 1/4టీ స్పూన్
ఉప్పు – తగినంత

కూర కోసం..
నూనె -3 టేబుల్ స్పూన్స్
మెంతులు – 2 చిటికెలు
ఎండుమిర్చి – 2
జీలకర్ర – 1 టీస్పూన్
ఉల్లిపాయలు – ¼ కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
పసుపు – 1/4టీ స్పూన్
కారం – 1 టీస్పూన్
జీలకర్ర పొడి – 1/2టీ స్పూన్
ధనియాల పొడి – 1/2టీ స్పూన్
ఇంగువ – 2 చిటికెలు
ఉప్పు – తగినంత
గరం మసాల – 1/2టీ స్పూన్
చాట్ మసాల – 1/4టీ స్పూన్
మెంతికూర – 100 గ్రాములు
పచ్చిమిచ్చి – 2 టేబుల్ స్పూన్స్
నిమ్మసరం – 1 టీస్పూన్

తయారీ విధానం
1.ఒక గిన్నెలో చెక్కు తీసిన ఆలు ముక్కులు, ఉప్పు, పసుపు, వేసి స్టవ్ పై పెట్టుకుని 80 శాతం ఉడికించి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి.
2.ఇప్పుడు వేరొక కడాయిలో నూనె వేడి చేసి, మెంతులు వేసి, కాస్త ఎర్రబడనివ్వాలి.
3. అందులోకి ఎండుమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ తరుగు వేసి , కలర్ వచ్చే వరకు వేపుకోవాలి.
4. ఉల్లి పాయలు వేగాక, ఇంగువ, ఉప్పు, వేసి, మెత్తపడనివ్వాలి.

5. ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేగాక, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి,కారం వేసి వేపుకోవాలి.
6. మసాలా వేగాకఅందులో మెంతికూర వేసుకుని, నూనె పైకి తేలే వరకు, ఉడికించి, ఆలు కూడా వేసుకుని, బాగా కలపి, ఉడకపెట్టి, నాలుగు నిముషాలు వేగనివ్వాలి.
7. చివరగా పచ్చిమిర్చి తరుగు , నిమ్మరసం వేసి, కలుపుకుని, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
8. ఆలు మేతి తయారైనట్లే..