Kitchenvantalu

Diamond Chips:బియ్యంపిండితో కరకరలాడే చిప్స్ సూపర్ టేస్టీగా ఉంటాయి

Diamond Chips:బియ్యంపిండితో కరకరలాడే చిప్స్ సూపర్ టేస్టీగా ఉంటాయి.. లంచ్ కు డిన్నర్ కు మధ్యలో, ఒక్క టీ, కాసిన్ని స్నాక్స్, ఈవినింగ్ టైమ్ లో లాగించామంటే, బాడీ అలసి పోకుండా, బ్రెయిన్ షార్ప్ గా వర్క్ చేస్తాయి. టీ విత్ డైమండ్ చిప్స్, సూపర్ కాంబినేషన్ కదా. మరి డైమండ్ చిప్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం.

కావాల్సిన పదార్ధాలు
మైదా – 250 గ్రాములు
బియ్యం పిండి – 1/4కప్పు
వాము – 1 టీ స్పూన్
ఉప్పు – తగినంత
నెయ్యి – 60 ML
నూనె – ఫ్రై చేయడానికి,

తయారీ విధానం
1.ఇప్పుడొక మిక్సింగ్ బౌల్ లో, మైదా పిండి, బియ్యం పిండి, వాము, ఉప్పు, డాల్డా వేసి, బాగా కలుపుకోవాలి.
2. కలుపుకున్న పిండిని 30 నిముషాల నాననివ్వాలి.
3. 30 నిముషాల తర్వాత పొడి పిండిని చల్లుకుని, పిండి ముద్దను సాధ్యమైనంత పల్చగా ఒత్తుకోవాలి.
4. ఇప్పుడు దాని పై మళ్లీ కొంచం పొడి పిండిని చల్లి, చిన్న చిన్న డైమండ్స్ లా కట్ చేసుకోవాలి.

5. కట్ చేసుకున్న డైమండ్స్ ను కింది భాగం నుంచి చాకుతో తీసి, పక్కన పెట్టుకోవాలి.
6. తీసుకున్న డైమండ్స్ అన్నిటిని జెల్లడలో వేసి, కొద్దిగా జల్లిస్తే, వేసిన పొడి పిండి కాస్త, కిందకు జారిపోతుంది.
7. ఇప్పుడు ఆ డైమండ్స్ ను వేడెక్కిన నూనెలోకి వేసి, హై ఫ్లైమ్ పై గోధుమరంగు వచ్చే వరకు వేపుకుని,జల్లి గరిటెతో బయటకి తీసుకోవాలి.
8. ఈ చిప్స్ పూర్తిగా చల్లారిన తర్వాత 3 గంటల తర్వాత ఎయిర్ టైట్ కంటేనర్ లో స్టోర్ చేసుకుంటే,15 రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి.