Healthhealth tips in telugu

Joint Pains:వెల్లుల్లితో ఇలా చేస్తే నడుం నొప్పి, వెన్నునొప్పి వంటి అన్ని రకాల నొప్పులు తగ్గిపోతాయి

Joint Pains:వెల్లుల్లితో ఇలా చేస్తే నడుం నొప్పి, వెన్నునొప్పి వంటి అన్ని రకాల నొప్పులు తగ్గిపోతాయి.. ఈ మధ్య కాలంలో మారిన జీవన శైలి కారణంగా మనలో చాలా మంది నడుం నొప్పి, వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. ఈ నొప్పులు ఉన్నప్పుడు కూర్చోలేరు.. నడవలేరు.. చాలా ఇబ్బందిగా ఉంటుంది. నడుం నొప్పి తగ్గడానికి వెల్లుల్లి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

దీనిలో అల్లిసిన్ ఉండటం వలన పెయిన్ కిల్లర్ గా పనిచేసి నడుం నొప్పి, వెన్ను నొప్పిని తగ్గిస్తుంది. ఉదయం సమయంలో ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను తినాలి. గ్యాస్ సమస్య ఉన్నవారు పరగడుపున అస్సలు తినకూడదు. గ్యాస్ సమస్య ఉన్నవారు. వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసి తేనెలో గంటసేపు నానబెట్టి తినవచ్చు.

అలా కాకుండా వెల్లుల్లిని రసంగా తీసి గోరువెచ్చని ఒక గ్లాసు పాలలో కలిపి తాగిన మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లి తో పాటు అల్లం కూడా నొప్పులను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ప్రతిరోజు అల్లం టీ తాగవచ్చు. లేదా ఒక గ్లాస్ నీటిలో ఒక అంగుళం అల్లం దంచి వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి ఒక స్పూన్ నిమ్మరసం., అర స్పూన్ తేనె కలిపి తాగవచ్చు.

ఈ రెండింటిలో మీకు లభ్యం అయిన దాన్నిబట్టి వెల్లుల్లి లేదా అల్లం రోజు తీసుకుంటే నొప్పులు తగ్గడమే కాకుండా పట్టేసిన కండరాలకు ఉపశమనం కలుగుతుంది. అలాగే ప్రతి రోజు వ్యాయామం లేదా యోగ క్రమం తప్పకుండా చేయాలి. అప్పుడే నడుం నొప్పి., వెన్ను నొప్పి లాంటి నొప్పులన్నీ సులభంగా తగ్గుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."