Healthhealth tips in telugu

Rose petals tea:ఉదయం ఒక కప్పు టీ తాగితే…జబ్బులు అన్ని పరార్…సర్వ రోగ నివారిణి

Rose petals tea:ఉదయం ఒక కప్పు టీ తాగితే…జబ్బులు అన్ని పరార్…సర్వ రోగ నివారిణి.. గులాబీ పువ్వులు అంటే మన అందరికీ తెలుసు. గులాబీ పువ్వులలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

వాటి గురించి మనలో చాలా మందికి తెలియదు. గులాబీ రేకులతో టీ తయారుచేసుకొని తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ టీ తయారు చేయటానికి తాజా గులాబీ రేకులు లేదా పొడిని వాడవచ్చు.

పొయ్యి మీద గిన్నె పెట్టి దానిలో ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో రెండు స్పూన్ల గులాబీ రేకులు లేదా ఒక స్పూన్ గులాబీ రేకుల పొడి వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. మరిగిన ఈ నీటిని వడకట్టి దానిలో ఒక స్పూన్ తేనె, అరచెక్క నిమ్మరసం కలిపి తాగాలి. ప్రతి రోజు ఉదయం తాగితే శరీరంలో వ్యర్ధాలు అన్నీ బయటకు పోతాయి.

గులాబీ టీలో యాంటీ ఇన్ ఫ్లేమేటరీ, యాంటీ బయటిక్ లక్షణాలు ఉండుట వలన శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. జీర్ణశక్తి పెరిగి అజీర్ణం, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు ఉండవు. ఒత్తిడి,ఆందోళన వంటివి తగ్గుతాయి.

నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రి పడుకోవటానికి అరగంట ముందు తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది. దగ్గు,జలుబు వంటి వాటిని తగ్గించటానికి కూడా సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ సమృద్దిగా ఉండుట వలన నరాలను ప్రశాంతపరచి ఆందోళనను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. డయబెటిస్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.