Healthhealth tips in telugu

Raw Mango Benefits: వేసవిలో పచ్చిమామిడి తినడం వల్ల కలిగే లాభాలు ఇవే…!

Raw Mango Benefits: వేసవిలో పచ్చిమామిడి తినడం వల్ల కలిగే లాభాలు ఇవే.. పచ్చి మామిడి కాయలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కొంత మంది పచ్చి మామిడి కాయను ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు, కారం కలిపి తింటూ ఉంటారు.

పచ్చి మామిడికాయతో జ్యుస్ చేసుకొని త్రాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. ఒకరకంగా చెప్పాలంటే పచ్చిమామిడి పవర్ ఫుల్ కూలింగ్ ఏజెంట్ అని చెప్పాలి.అంతేకాక శరీరంలో మినరల్స్ బయటకు పోకుండా చేస్తుంది.

పచ్చి మామిడికాయల ముక్కలను తినటం లేదా జ్యుస్ త్రాగటం వలన మలబద్దకం, డయేరియా, అజీర్ణం, గ్యాస్ వంటి జీర్ణ సంబంధ సమస్యలు అన్ని తొలగి పోతాయి. పచ్చి మామిడికాయలో నియాసిన్ సమృద్ధిగా ఉండుట వలన రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతోపాటు రక్తనాళాల్లో ఏర్పడే ఆటంకాలను కూడా తొలగించి గుండె వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

పచ్చి మామిడికాయ ముక్కలను తినటం వలన చిగుళ్లు,దంతాలు బలంగా మారటమే కాకుండా చిగుళ్ల నుండి రక్తస్రావం సమస్య కూడా తొలగిపోతుంది. స్కర్వీ వ్యాధి ఉన్న వారు రెగ్యులర్ గా పచ్చి మామిడి కాయలను తింటే చాలా మంచిది. ఇందులో ఉండే విటమిన్ సి స్కర్వీకి మందుగా పనిచేస్తుంది. దీంతోపాటు ఎర్ర రక్తకణాల ఉత్పత్తి కూడా బాగా పెరుగుతుంది.

పచ్చి మామిడి కాయలను తినడం వల్ల లివర్ శుభ్రమవుతుంది. చిన్న పేగుల్లోకి పైత్య రసాలు బాగా విడుదలవుతాయి. దీంతో కొవ్వులను శరీరం తేలిగ్గా జీర్ణం చేస్తుంది. పేగులు, జీర్ణాశయంలో ఉండే బాక్టీరియా, వైరస్‌లు నశిస్తాయి. మధ్యాహ్నం భోజనం అయ్యాక పచ్చి మామిడికాయ ముక్కను తింటే శరీరానికి అవసరమైన శక్తి లభించి చురుగ్గా ఉంటారు. అంతేకాక మధ్యాహ్న నిద్ర మత్తు కూడా పోతుంది.

పచ్చి మామిడి మధుమేహం ఉన్నవారు కూడా తినవచ్చు. రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది. పచ్చి మామిడికాయలో పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేస్తాయి. దీనివల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. దాంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది. ఎసిడిటితో బాధపడుతూ ఉన్నప్పుడు చిన్న పచ్చి మామిడికాయ ముక్కను తింటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.

పచ్చి మామిడికాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన సీజన్ మారినప్పుడు వచ్చే ఇన్ ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పచ్చిమామిడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి సహాయపడతాయి. అలాగే ఏజింగ్ లక్షణాలను నివారిస్తాయి.

కాబట్టి పచ్చిమామిడి తింటూ ఉండండి.. మీ చర్మాన్ని కాపాడుకోండి. పచ్చి మామిడికాయ ముక్కను నీటిలో ఉడికించి ఆ నీటిని వడకట్టాలి. ఈ నీటిని రాత్రి పడుకొనే ముందు ముఖానికి రాసి మరుసటి రోజు ఉదయం ముఖాన్ని శుభ్రం చేసుకుంటే జిడ్డు,దుమ్ము అన్ని తొలగిపోతాయి. మామిడికాయలో ఉన్న యాట్రిజెంట్ ప్రాపర్టీస్ చర్మ సమస్యలను తగ్గిస్తుంది.

గర్భధారణ సమయంలో ప్రతి మహిళ మార్నింగ్ సిక్ నెస్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు చిన్న మామిడికాయ ముక్కను తింటే ఉపశమనం కలుగుతుంది. అధిక చెమట సమస్య కూడా తగ్గుతుంది. పచ్చి మామిడిని లిమిట్ గా తింటే ఇప్పుడు చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలు అన్ని పొందవచ్చు. అయితే ఎక్కువగా తింటే కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.