Kitchenvantalu

Crispy Corn:కరకర లాడే క్రిస్పీ కార్న్ ఇలా ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టండి

Crispy Corn:కరకర లాడే క్రిస్పీ కార్న్ ఇలా ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టండి.. Corn తో పిల్లలకు ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. దీనిని తయారుచేయటం కూడా చాలా సులభమే.

కావాల్సిన పదార్ధాలు
మొక్కుజొన్న పొత్తులు – 2
కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్
బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్
పెప్పర్ పౌడర్ – ½ టీ స్పూన్
ఉప్పు – ½ టీ స్పూన్
నీళ్లు -1-2 టీ స్పూన్స్
కారం – చిటికెడు
ఉప్పు – చిటికెడు
చాట్ మసాలా – ¼ టీ స్పూన్
జీలకర్ర పొడి – టీ స్పూన్
నిమ్మరసం – కొద్దిగా

తయారీ విధానం
1.అంచులను కట్ చేసిన రెండు మొక్కజొన్న పొత్తులను తీసుకోవాలి.
2.మొక్కజొన్న పొత్తులను టూత్ పిక్ అంత సైజ్ లో కట్ చేసుకోవాలి.
3.కార్న్ గింజలను టూత్ పిక్ లకు గుచ్చుకోని పొత్తును తీసివేయాలి.
4.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని కొంచెం నీళ్లు పోసి మరిగించుకోని అందులోకి కార్న్ లను ఉడికించుకోవాలి.
5.ఒక మిక్సింగ్ బౌల్ లోకి కార్న్ ఫ్లోర్,రైస్ ఫ్లోర్,పెప్పర్ పౌడర్,సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి.

6.ఇప్పుడు ఈ మిక్సర్ తో ఉడికించిన కార్న్ టూత్ పిక్లను కోట్ చేసుకోవాలి.
7.స్టవ్ పై వేరొక ప్యాన్ పెట్టుకోని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వెడెక్కనివ్వాలి.
8.ఇప్పుడు అందులోకి కార్న్ టూత్ పిక్స్ తో సహా నూనె లో వేసి కాల్చుకోవాలి.
9.కార్న్ బాగా క్రిస్పిగా అయ్యాక జల్లిగరిటతో బయిటికి తీసుకోని టిష్యూ పేపర్ పై ఉంచాలి.
10.ఒక మిక్సింగ్ బౌల్ కారం,ఉప్పు,చాట్ మసాలా,పెప్పర్ పౌడర్,జీలకర్రపొడి వేసి మిక్స్ చేసుకోని ఫ్రై చేసుకున్న కార్న్ పై చల్లుకోని సర్వ్ చేసుకోవాలి.
Click Here To Follow Chaipakodi On Google News