Kitchenvantalu

Potato Rice:లంచ్ బాక్స్ లోకి సింపుల్ గా 5 నిమిషాల్లో ఇలా చేయండి.. సూపర్ టేస్టీ…

Potato Rice:లంచ్ బాక్స్ లోకి సింపుల్ గా 5 నిమిషాల్లో ఇలా చేయండి.. సూపర్ టేస్టీ…బంగాళదుంప అంటే అందరికి ఇష్టం. ప్రతి సారి ఒకేలా కాకుండా ఇలా rice గా సింపుల్ గా చేసుకుంటే చాలా బాగుంటుంది.

స్కూల్స్ కి,ఆఫీస్లకి బాక్స్ ప్రిపేర్ చెయ్యాలంటే ..టైం తక్కువ,టేస్ట్ ఎక్కువ ఉండే స్పెషల్స్ కోసం వెతుకుతూ ఉంటాం. లంచ్ బాక్స్ కీ పర్ ఫెక్ట్ ఆలు రైస్ ఎలా చేయాలో చూసేయండి.

కావాల్సిన పదార్ధాలు
బంగాళదుంప ముక్కలు – 1 కప్పు
నూనె – 6 టేబుల్ స్పూన్స్
జీడిపప్పు – 15
దాల్చిన చెక్క – ¼ ఇంచ్
లవంగాలు – 1-2
యాలకులు – 2
ఆవాలు – ½ టీ స్పూన్
జీలకర్ర – ½ టీ స్పూన్
సోంపు – ½ టీ స్పూన్
మిరయాలు – ¼ టీ స్పూన్
పచ్చిమిర్చి – 1
కరివేపాకు – 2 రెబ్బలు
అల్లం తురుము – 1 టీ స్పూన్
అన్నం – 1 కప్పు
పచ్చికొబ్బరి తురుము- ¼ కప్పు
కొత్తిమీర – కొద్దిగా
మిరయాల పొడి – ¼ కప్పు

తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నూనె వేడి చేసి ఆలూ ముక్కలను దోరగా వేపి తీసుకోవాలి.
2.అదే నూనెలోకి దాల్చిన చెక్క,లవంగాలు,యాలకులు,మిరియాలు,జీలకర్ర వేసి వేపుకోవాలి.
3.మసాల వేగాక కరివేపాకు ,పచ్చిమిర్చి ,అల్లం తరుగు,జీడిపప్పు వేసి వేపుకోవాలి.
4.తరువాత ఉల్లిపాయ తరుగు ,ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
5.ఉల్లిపాయలు వేగాక వండిన అన్నం వేసి కొత్తిమీర ,పచ్చికొబ్బరి తురుము,మిరియాల పొడి వేసి హై ఫ్లేమ్ పై టాస్ చేసుకోవాలి.