Healthhealth tips in telugu

Health Tips:నిత్య జీవితంలో ఉపయోగపడే ఆరోగ్య చిట్కాలు

Health Tips:నిత్య జీవితంలో ఉపయోగపడే ఆరోగ్య చిట్కాలు… ప్రతి రోజు మనకు ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలను తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.

ప్రతిరోజు పుదీనా ఆకుల్ని తినటం వలన నోటి దుర్వాసన తొలిగిపోవటంతో పాటు పిప్పి పళ్ళు రావటం, చిగుళ్ల నుండి రక్తం కారడం తగ్గిపోతుంది.

ప్రతి రోజు అరస్పూన్ మిరియాల పొడిని ఆహారంతో పాటు తీసుకుంటే రక్తంలో కొలస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది.

చిటికెడు మునగాకు పొడిని ప్రతి రోజు తింటూ ఉంటే రక్తపోటు అదుపులో ఉంటుంది.

రక్తహీనతతో బాధపడేవారు టీ, కాఫీలలో పంచదారకు బదులుగా తేనెను ఉపయోగిస్తే రక్తం వృద్ధి అవడంతో పాటు రక్తం శుద్ధి అవుతుంది.

అరటి పండులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. అనీమియా ను అరికడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బిపి, గుండె జబ్బులు, రక్తనాళాలు మందంగా తయారు అయినవారూ బీటు రూట్ రసంను ప్రతి రోజూ త్రాగుతూ ఉంటే రక్త ప్రసరణ మెరుగు అవుతుంది.