Healthhealth tips in telugu

Joint Pains:కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారా… అయితే ఇవి తప్పనిసరి..

Joint Pains:కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారా… అయితే ఇవి తప్పనిసరి..:ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టే సమస్య కీళ్ల నొప్పులు.. కీళ్ల నొప్పుల తోబాధపడే వారు కొన్ని ఆహారాలు తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది అసలు కీళ్ల నొప్పులు రావటానికి ఆహారపు అలవాట్లు మారిన జీవన శైలి పోషకాహార లోపం వంటివి కారణాలుగా చెప్పవచ్చు.

వాల్ నట్స్ కీళ్ల నొప్పులు తగ్గించడంలో చాలా .బాగా పనిచేస్తాయి రోజుకి మూడు వాల్నట్స్ తీసుకుంటే వాటిలో ఉండే ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కీళ్లనొప్పులను తగ్గిస్తాయి.

ఆపిల్ సైడర్ వెనిగర్ కీళ్ల నొప్పులు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది భోజనం చేయటానికి అరగంట ముందు గోరువెచ్చని నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ తేనే కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది

ప్రతిరోజు నీటిలో నానబెట్టిన మెంతులు తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి లేదా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో మెంతుల పొడి వేసి కలిపి తీసుకున్నా మంచి ఫలితం కనబడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.