Beauty Tips

Face Glow Tips:వెల్లుల్లితో ఇలా చేస్తే నల్లని మచ్చలు, మొటిమలు అన్నీ ఒక్కరోజులో మాయం

Face Glow Tips:వెల్లుల్లితో ఇలా చేస్తే నల్లని మచ్చలు, మొటిమలు అన్నీ ఒక్కరోజులో మాయం.. ముఖం మీద నల్లని మచ్చలు,మొటిమలు లేకుండా కాంతి వంతంగా మెరవటానికి ఇప్పుడు చెప్పే చిట్కా బాగా పనిచేస్తుంది.

ఈ చిట్కా కోసం వెల్లుల్లిని ఉపయోగిస్తున్నాం. వెల్లుల్లిలో ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నాలుగు వెల్లుల్లి రెబ్బలను తొక్కలు తీసి నీటిలో వేసి ఉడికించాలి.

ఉడికిన వెల్లుల్లిని నీటితో సహ మిక్సీలో వేసి మిక్సీ చేసి వడకట్టాలి. ఈ వెల్లుల్లి నీటిలో ఒక స్పూన్ కార్న్ ఫ్లౌర్ వేసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. ఈ మిశ్రమం క్రీమ్ గా మారుతుంది. ఈ క్రీమ్ చల్లారాక ఒక బౌల్ లో తీసుకొని దానిలో పావు స్పూన్ లో సగం విటమిన్ E ఆయిల్, ఒక స్పూన్ ఆలోవెరా జెల్ వేసి బాగా కలపాలి.

ఈ క్రీమ్ ని ఫ్రిజ్ లో పెడితే దాదాపుగా పది రోజులు నిల్వ ఉంటుంది. ఈ క్రీమ్ ని ప్రతి రోజు ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా పది రోజుల పాటు చేస్తే నల్లని మచ్చలు,మొటిమలు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."