Healthhealth tips in telugu

Kidney Stones:కిడ్నీలో రాళ్ళు ఉన్నాయా…వీటికి దూరంగా ఉండాల్సిందే..

Kidney Stones:కిడ్నీలో రాళ్ళు ఉన్నాయా…వీటికి దూరంగా ఉండాల్సిందే… ఈ రోజుల్లో కిడ్నీ సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. ముఖ్యంగా కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతూ ఉన్నారు.

ఈ సమస్యను అశ్రద్ధ చేస్తే కిడ్నీ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది అంతేకాకుండా అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కిడ్నీలో రాళ్ళ సమస్య ఉన్నవారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటేనే మంచిది.

ప్రతి రోజు మనలో చాలా మందికి ఉదయం టీ తాగనిదే ఏ పని సాగదు. ఇలా టీ తాగటం వలన కిడ్నీల్లో రాళ్ళ పరిమాణం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్పుతున్నారు. చాక్లెట్స్ ఎక్కువగా తిన్నప్పుడు కూడా ఇదే విధంగా జరుగుతుంది.

బచ్చలి కూర కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే ట‌మాటాలు, కూల్ డ్రింక్స్‌, సోడాలు, బీట్‌రూట్‌, కంద‌గ‌డ్డ‌, జంక్ ఫుడ్‌,నిల్వ ఉన్న పచ్చళ్లు, సాల్ట్ నట్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు డాక్టర్ సలహాను తప్పనిసరిగా పాటించాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.