Healthhealth tips in telugu

Gangapayala Aaku : తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలు ఉన్న ఈ ఆకుకూర గురించి మీకు తెలుసా?

Gangapayala Aaku : తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలు ఉన్న ఈ ఆకుకూర గురించి మీకు తెలుసా.. గంగ పాయల ఆకు కూరని గంగ పాయ, గోళీ కూర అని కూడా పిలుస్తారు .

ఇందులో సన్ పాయల , పుల్ల పాయల, పెద్ద పావిలి, బొడ్డు పాయల అని నాలుగు రకాలు ఉన్నాయి. ఈ మొక్కను దాదాపుగా అందరు చూసే ఉంటారు. ఈ మొక్క ఎక్కువగా పల్లెటూరులో మరియు పొలాల గట్ల మధ్య ఎక్కువగా కనపడుతూ ఉంటుంది .

ఇది నెల మీద పాకుతుంది. ఆకులు చాలా దళసరిగా ఉండి పసుపు పచ్చని పూలు పూస్తాయి. పుల్లగా ఉండే ఈ కూరతో కూర,పప్పు చేసుకుంటారు. గంగ పాయల కూర చాలా సులభంగా పెరుగుతుంది. పెద్దగా సంరక్షణ చేయవలసిన అవసరం లేదు. ఈ ఆకులో చాలా పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాల గురించి తెలుసుకుంటే ఈ కూరను చాలా ఇష్టంగా తింటారు.

ఒకవేళ తినని వారు ఉంటే ఇప్పుడు చెప్పే ప్రయోజనాలు తెలుసుకొంటే తప్పనిసరిగా తినటం అలవాటు చేసుకుంటారు. గంగ పాయల ఆకులో విటమిన్ A,B,C,D లతో పాటు కాల్షియం,పొటాషియం,ఐరన్,మాంగనీస్,మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. గంగ పాయల కూరలో తక్కువ కేలరీలు, ఎక్కువ పీచు పదార్ధం ఉండుట వలన బరువు తగ్గాలని అనుకునేవారికి మంచి కూర అని చెప్పవచ్చు.

గంగ పాయల కూరలో పీచు సమృద్ధిగా ఉండుట వలన జీర్ణ సంబంధ సమస్యలను పరిష్కరిస్తుంది. దాంతో మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి. గంగ పాయల ఆకులు తినడం వల్ల ఇందులో ఒమేగా 3 ఫాటి ఆమ్లాలు ఉండడం వల్ల మన శరీరంలో LDL అంటే చెడు కొలెస్ట్రాల్ ను నాశనం చేస్తుంది.

రక్త ప్రహవానికి అడ్డు వచ్చే కొలెస్ట్రాల్ లేకపోవటం వలన గుండెకు మేలు జరుగుతుంది. అలాగే రక్తపోటు సమస్యను కూడా తగ్గిస్తుంది. ఒమేగా 3 ఫాటి ఆమ్లాలు గంగ పాయల కూరలో ఉన్నంత విధంగా ఏ ఆకుకూరలోను ఉండదు. ఇందులో ఐరన్,కాఫర్ సమృద్ధిగా ఉండుట వలన రక్తంలో రక్త కణాల సంఖ్యను పెంచటంలో సహాయపడతాయి. రక్తహీనత సమస్యతో ఉన్నవారు తరచుగా ఈ కూరను తింటే ఆ సమస్య నుండి బయట పడవచ్చు.

అన్ని ఆకుకూరల్లో కన్నా ఈ గంగ పాయల ఆకుల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉండుట వల్ల కంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. అంతేకాక చర్మంపై ఏర్పడే ముడతలు,నల్లని మచ్చలు,చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించి కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. గంగ పాయిల్ల మొక్కలో జింక్ అధికంగా ఉండుట వలన ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేస్తుంది.

ఇందులో కాల్షియం ,పొటాషియం అధికంగా ఉండడం వల్ల ఏముకలు దృడంగా ఉండేలాగా చేస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఈ కూరలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి అవసరమైన అన్ని పోషకాలు గంగ పాయల కూరలో ఉన్నాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.