Healthhealth tips in telugu

Teeth Pain:పంటి నొప్పి,పంటి ఇన్ ఫెక్షన్, పిప్పి పన్ను సమస్యలను తగ్గించే అద్భుతమైన ఆకు

Teeth Pain:పంటి నొప్పి,పంటి ఇన్ ఫెక్షన్, పిప్పి పన్ను సమస్యలను తగ్గించే అద్భుతమైన ఆకు.. పంటి నొప్పి,పంటి ఇన్ ఫెక్షన్, పిప్పి పన్ను వంటి సమస్యలను తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయ పడతాయి.

ఈ సమస్యలు వచ్చినప్పుడు జామ ఆకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నాలుగు జామ ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని నోటిలో పోసుకొని పుక్కిలించాలి.

ఈ విధంగా రోజులో రెండు సార్లు చేస్తే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. జామ ఆకులలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు, యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణాలు ఉండుట వలన చిగుళ్ళ వాపును తగ్గించటమే కాకుండా నోటి ఆరోగ్యం బాగుండేలా చేయటమే కాకుండా నోటి దుర్వాసన కూడా తొలగించటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

జామ ఆకులు దంతాలను బలంగా,ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. నోటి పూతలను తగ్గించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది. జామ ఆకులు కూడా చాలా విరివిగానే లభ్యం అవుతాయి. కాబట్టి ఈ చిట్కా ఫాలో అయ్యి పంటికి సంబందించిన అన్నీ రకాల సమస్యల నుండి బయట పడవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.