Healthhealth tips in telugu

Pain Killer Oil:ఈ నూనె నరాల ఒత్తిడి,మెడ నొప్పి,చేయి లాగటం వంటి నొప్పులను తగ్గిస్తుంది

Pain Killer Oil:ఈ నూనె నరాల ఒత్తిడి,మెడ నొప్పి,చేయి లాగటం వంటి నొప్పులను తగ్గిస్తుంది.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక నొప్పి వస్తూ ఉంటుంది. మెడ నొప్పి, చేతులు లాగటం, నరాల ఒత్తిడి వంటి సమస్యలకు ఆవనూనె చాలా బాగా సహాయపడుతుంది. నొప్పులను తగ్గించటానికి ఆవనూనెను పురాతన కాలం నుండి వాడుతున్నారు. ఆవనూనె చర్మం లోపలకు చొచ్చుకొని పోయి నొప్పులను తగ్గిస్తుంది.

ఆవనూనెను రాయటం వలన రక్తప్రసరణను పెంచి కీళ్ళు, కండరాల నొప్పులను తగ్గిస్తుంది. ఆవనూనెలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు నొప్పులను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది. ఆవనూనెలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉండటం వల్ల ఆర్థరైటిస్ వల్ల కలిగే దృడత్వం మరియు నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది.ఆవనూనెలో సెలీనియం ఉంటుంది.

దీనిని నొప్పి నివారిణి అని కూడా అంటారు. ఆవనూనె నొప్పులను,వాపులను తగ్గించటంలో సహాయపడుతుంది. నరాల ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ నూనెను ఆయుర్వేదంలో ఎక్కువగా నొప్పుల ఉపశమనం కొరకు వాడతారు. ఆవ నూనెతో బాడీ మసాజ్ చేయడం వల్ల శరీరాన్ని రిఫ్రెష్ చేయవచ్చు మరియు అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. ఇది శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణను పెంచుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.