Kitchenvantalu

Ragi uthappam:అమ్మమ్మ స్టైల్ రాగి ఊతప్పం.. చాలా రుచిగా ఉంటుంది

Ragi uthappam:రాగి ఉతప్పం.. రాగులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వారంలో రెండు లేదా మూడు సార్లు రాగులను ఆహారంలో బాగంగా చేసుకుంటే మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ఇప్పుడు రాగి ఉతప్పం ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్ధాలు
రాగి పిండి – 1 కప్పు
మినపప్పు – 1/4 కప్పు
అటుకులు – 1/4 కప్పు
రుచికి ఉప్పు
నూనె – 1 టేబుల్ స్పూన్

తయారి విధానం
ఒక గిన్నెలో మినపప్పు,అటుకులలో నీటిని పోసి 2 నుండి 3 గంటల పాటు నానబెట్టాలి. నానిన మినపప్పు,అటుకులను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని గిన్నెలోకి తీసుకోని రాగి పిండి,సరిపడా ఉప్పు,సరిపడా నీటిని పోసి బాగా కలపాలి.

ఈ పిండిని 8 గంటల పాటు అలా వదిలేసి.. ఆ తర్వాత పొయ్యి మీద పెనం పెట్టి పిండిని అట్టులా పోసి నూనె వేసి రెండు వైపులా కాల్చాలి. అంతే రాగి
ఉతప్పంను చట్నీతో వేడిగా సర్వ్ చేయండి.