Kitchenvantalu

Lemon kodo millet rice:ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచి కి రుచి అరికెల పులిహోర

Lemon kodo millet rice:ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచి కి రుచి అరికెల పులిహోర.. ఈ మధ్య కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగి Millets వాడటం అలవాటుగా చేసుకున్నారు. అరికెలతో పులిహోర చేసుకుంటే చాలా బాగుంటుంది.

కావలసిన పదార్ధాలు
అరికెలు – 1 కప్పు
నీరు – 1 ½ కప్పులు
నిమ్మరసం – 1
ఎర్ర మిర్చి – 2
కరివేపాకు
ఇంగువ – చిటికెడు
ఆవాలు – 1 స్పూన్
పసుపు పొడి – 1 tsp
వేరుశెనగ నూనె – 3 టేబుల్ స్పూన్లు

తయారీ
అరికెలను శుభ్రంగా కడిగి ఒకటికి రెండు నీటిని పోసి కుక్కర్ లో ఉడికించాలి. ఉడికిన అరెకల అన్నాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. పెద్ద బాణలిలో 1 టేబుల్ స్పూన్ నూనె తీసుకుని అందులో ఎండు మిర్చి, ఆవాలు, కరివేపాకు,ఇంగువ,పసుపు వేసి వేగించాలి.

ఆ తర్వాత పొయ్యి ఆఫ్ చేసి నిమ్మరసం,ఉడికించిన అరికెలు వేసి బాగా కలపాలి. దీనిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తినవచ్చు. ఇలా తింటే అలసట లేకుండా హుషారుగా ఉంటారు.