Healthhealth tips in telugu

Headache:ఎంతటి భరించలేని తలనొప్పి,మైగ్రేన్ అయినా సరే 2 నిమిషాల్లో తగ్గిపోతుంది

Headache:ఎంతటి భరించలేని తలనొప్పి,మైగ్రేన్ అయినా సరే 2 నిమిషాల్లో తగ్గిపోతుంది.. తలనొప్పి సమస్య చిన్నదే అయిన ఒక్కోసారి భరించలేని నొప్పి ఉంటుంది. తలనొప్పి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండలేము. అలాగే ఏ పని చేయాలన్నా కోరిక కూడా ఉండదు. తలనొప్పి వచ్చినప్పుడు Tablets జోలికి వెళ్లకుండా సహజసిద్దమైన అయిల్స్ తో మసాజ్ చేస్తే తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

Peppermint oil తలనొప్పిని తగ్గించటానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ నూనెలో మెంథాల్ ఉండుట వలన కండరాలను రిలాక్స్ చేసి నొప్పి నుండి ఉపశమనం కలిగేలా చేస్తుంది. తలనొప్పిగా ఉన్నప్పుడూ ఈ నూనెను నుదురుకి రాసి సున్నితంగా మసాజ్ చేస్తే సరిపోతుంది. ఈ నూనె ఆయుర్వేదం షాప్ లలో లేదా online stores లో లభ్యం అవుతుంది.

Rosemary oil తలనొప్పిని తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ నూనెను తలనొప్పి చికిత్సలో చాలా పురాతన కాలం నుండి వాడుతున్నారు. ఈ నూనెలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు అనాల్జేసిక్ (నొప్పి నివారిణి) లక్షణాలు ఉండుట వలన ఒత్తిడిని తగ్గించి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఈ రెండు నూనెలు తలనొప్పి మరియు మైగ్రేన్ తలనొప్పి వంటి వాటిని తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఈ రెండు నూనెలలో మీకు ఏది లభ్యం అయితే ఆ నూనెను వాడవచ్చు. ఈ నూనె నుదురుకి రాసి మసాజ్ చేసి ఒక అరగంట సమయం ప్రశాంతంగా పడుకుంటే తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.