Healthhealth tips in telugu

Warm Water:ఉదయం పరగడుపున 1 గ్లాసు గోరువెచ్చని నీటిని తాగితే…ముఖ్యంగా ఈ సీజన్ లో…

Warm Water:ఉదయం పరగడుపున 1 గ్లాసు గోరువెచ్చని నీటిని తాగితే…ముఖ్యంగా ఈ సీజన్ లో… నీటిని ఎక్కువగా త్రాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మన అందరికి తెలిసిన విషయమే. అదే వేడి నీటిని త్రాగితే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో మీకు తెలుసా? ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు వేడి నీటిని త్రాగటం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

ప్రతి రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో దినచర్యను ప్రారంభిస్తే భవిష్యత్ ఆరోగ్యం బాగుంటుంది. దగ్గు, జలుబు మరియు గొంతు నొప్పి సమస్యలున్నప్పుడు వేడినీళ్ళు త్రాగడం ఒక గొప్ప నేచురల్ హోం రెమడీ. ఇది నిరంతర వేధించి పొడి దగ్గును తగ్గించి, శ్వాసనాళాన్ని తేలికచేసి, సరైన శ్వాస పీల్చుకొనేందుకు సహాయపడుతుంది.

అలాగే గొంతునొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. వేడి నీటిని త్రాగటం వలన శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. శరీరంలో మలినాలు తొలగిపోవాలంటే ప్రతి రోజు ఉదయం, రాత్రి పడుకొనే ముందు వేడి నీటిని త్రాగాలి. వేడి నీటిని  త్రాగడం వల్ల శరీరంలో వేడి పుట్టి, చెమట పట్టడం ప్రారంభం అవుతుంది. దాంతో శరీరంలోని టాక్సిన్స్ చెమట రూపంలో బయటకు నెట్టివేస్తుంది.

వేడి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మం లోపలి నుండి శుభ్రం అయ్యి మొటిమలు,మచ్చలు వంటివి తొలగిపోతాయి. చర్మంలో రక్త ప్రసరణను పెంచి చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాక చర్మం తేమగా ఉండేలా చేస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మలబద్దకం సమస్యతో బాధపడేవారికి వేడి నీరు దివ్య ఔషధం అని చెప్పాలి.

తిన్న ఆహారం ప్రేగుల్లో స్మూత్ గా ముందుకు జరిగి జీర్ణం అవ్వడానికి వేడి నీరు అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి, ప్రతి రోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే, గోరువెచ్చని నీటిని పరగడుపున త్రాగాలి. అధిక బరువు ఉన్నవారు వేడి నీటిని త్రాగితే చర్మం క్రింది భాగంలో ఉన్న కొవ్వుకణాలను విచ్చిన్నం చేసి బరువు తగ్గటంలో సహాయం చేస్తుంది.

ప్రతి రోజూ రెగ్యులర్ గా వేడీ నీటిని త్రాగడం వల్ల వృద్దాప్య ఛాయలను నివారించి యవ్వనంగా ఉండేలా చేస్తుంది. ఇది శరీరం నుండి టాక్సిన్స్ ను బయటకు నెట్టడం వల్ల చర్మకణాలను రిపేర్ చేస్తుంది. అది హానికరమైన ఫ్రీరాడిక్స్ మీద ఎఫెక్టివిగ్ గా పనిచేస్తుంది. వేడి నీటిని  రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చర్మ  ఎలాసిటి పెరుగుతుంది. అలాగే చర్మం కాంతివంతంగా మారుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.