Kitchenvantalu

Miriyala Pulusu:ఒంటికి హాయినిచ్చే ఘాటైన మిరియాల పులుసు

Miriyala Pulusu:ఒంటికి హాయినిచ్చే ఘాటైన మిరియాల పులుసు.. మిరియాల పులుసును వారంలో రెండు సార్లు చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నో అనారోగ సమస్యలకు పరిష్కారం చూపుతుంది.

కావాల్సిన పదార్ధాలు
మిరియాల పేస్ట్ కోసం..
మిరియాలు – 2 టేబుల్ స్పూన్స్
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
ధనియాలు – 1.5 టేబుల్ స్పూన్
పెసరపప్పు – లేదా – శనగపప్పు – 1 టేబుల్ స్పూన్
మెంతులు – 1/4టేబుల్ స్పూన్
బియ్యం – 1 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి – 8 నుంచి 10
పచ్చి కొబ్బరి – 1/4కప్పు
కరివేపాకు – 1 రెమ్మ

పులుసు కోసం ..
నూనె – 3 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1 టేబుల్ స్పూన్
కరివేపాకు – 2 రెమ్మలు
ఇంగువ – 2 చిటికెలు
సాంబార్ ఉల్లిపాయలు – 1 కప్పు
వెల్లుల్లి – 10
ఉప్పు – తగినంత
పసుపు – 1/4టీ స్పూన్
టమాటోలు – రెండు
చింతపుండు పులుసు – 300ML
నీళ్లు – 400ML

తయారీ విధానం
1.మిరియాల పేస్ట్ కోసం తీసుకున్న పదార్ధాలు అన్ని వేసి, సన్నని సెగపై , ఎర్రగా వేపుకోవాలి.
2. వేగిన పప్పులను, నీళ్లు యాడ్ చేసి, మిక్సీ జార్ లోకి వేసుకుని, పేస్ట్ లా చేసుకోవాలి.
3. నూనె వేడి చేసిన తర్వాత, అందులోకి ఆవాలు, కరివేపాకు, ఇంగువ, వేసి వేపుకోవాలి.
4. తర్వాత ఉల్లి పాయలు, పసుపు, ఉప్పు వేసి, ఉల్లిపాయ మెత్తపడే వరకు వేపుకోవాలి.

5. అందులోకి టమాటో ముక్కలు కూడా వేసి, మెత్త పడే వరకు మగ్గనివ్వాలి.
6. మగ్గిన టమాటాల్లోకి చింతపండు పులుసు పోసి, రెండు పొంగులు రానివ్వాలి,
7. పొంగుతున్న పులుసులో మిరియాల పేస్ట్ , నీళ్లు వేసి మూత పెట్టుకుని, 15 నిముషాలు సన్నని సెగపై మరగనివ్వాలి.
8. బాగా మరిగిన పులుసు లోకి, అవసరం బట్టి, ఉప్పు, కారాలు వేసుకుని, బెల్లం కూడా యాడ్ చేసుకుని, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
9. అంతే మిరియాల పులుసు తయార్.