Kitchenvantalu

Challa Punugulu:అప్పటికపుడు చేసే చల్ల పునుగులు రుచిగా ఇలా చేయండి.. క్రిస్పీగా సూపర్ గా ఉంటాయి

Challa Punugulu:అప్పటికపుడు చేసే చల్ల పునుగులు రుచిగా ఇలా చేయండి.. క్రిస్పీగా సూపర్ గా ఉంటాయి.. మిగిలిపోయిన ఇడ్లీ,దోశపిండితో పునుగులు వేస్తుంటాం కదా. పుల్లని పెరుగుతో చల్ల పునుగులు ఎలా వేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్ధాలు
పుల్లని పెరుగు – 1 కప్పు
మైదా – 1 కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి – 2 టేబుల్ స్పూన్స్
అల్లం తరుగు – 1 టేబుల్ స్పూన్
కరివేపాకు – 1 టేబుల్ స్పూన్
నూనె – వేపుకోవడానికి
వంట సోడా – ½ టేబుల్ స్పూన్
నీళ్లు – తగినన్ని

తయారీ విధానం
1.ఒక మిక్సింగ్ బౌల్ లోకి నూనె తప్ప అన్ని పదార్ధాలను వేసి కొద్దిగా జారుగా కలుపుకోని గంట పాటు నాననివ్వాలి.
2.గంట తర్వాత పిండిని మల్లీ ఒకసారి బాగా కలుపుకోవాలి.
3.స్టవ్ పై కడాయి పెట్టుకోని ఆయిల్ వేసి బాగా వేడెక్కనివ్వాలి.

4.వేడెక్కిన నూనెలో చిన్న చిన్న బాల్స్ లా పునుగులు జారవిడుచుకోవాలి.
5. మీడియం ఫ్లేమ్ పై పునుగులను ఎర్రగా వేపుకోని జల్లి గరిట సాయంతో తీసేసుకోవాలి.
6.అంతే వేడి వేడి చల్ల పునుగులు తయారైనట్టే.