Kitchenvantalu

Kitchen Hacks:వీటిని కూల్ డ్రింక్స్‌తో శుభ్రం చేస్తే మిలమిలా మెరుస్తాయి

Cool Drinks Kitchen Hacks:వీటిని కూల్ డ్రింక్స్‌తో శుభ్రం చేస్తే మిలమిలా మెరుస్తాయి.. మనం సాధారణంగా విపరీతంగా దాహం వేసినప్పుడు లేదా కొంచెం నీరసంగా అనిపించినప్పుడు త్రాగుతూ ఉంటాం.

కానీ కొంతమంది అవసరం ఉన్నా లేకపోయినా తాగేస్తూ ఉంటారు. అయితే కూల్ డ్రింక్ అనేది చాలా ప్రమాదమని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే, కూల్ డ్రింక్ లలో కలిపే యాసిడ్ వాహనాల బ్యాటరీ యాసిడ్ కు ఒకే పవర్ కలిగి ఉంటుంది.

దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ డ్రింక్స్ మనకు ఎంత హాని చేస్తాయో. అయితే అవి మనకు అనారోగ్యాలను కలిగించినా, వేరే రకంగా బాగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

కోకో కోలా డ్రింక్ దుస్తులపై పడిన రక్తపు మరకలను తొలగించడంలో బాగా సహాయపడుతుంది. అంతేకాక డ్రింక్ లలో దేన్నయినా కొంచెం తీసుకుని మరకలు ఉన్న ప్రదేశంలో రాస్తే, అవి తొలగిపోతాయట.

టాయిలెట్ సీట్ పై కోలా డ్రింక్ పోసి కొంచెం సేపు అయ్యాక ఫ్లష్ చేసి శుభ్రం చేస్తే, టాయిలెట్ శుభ్రమవుతుంది.

రక్తపు మరకలే కాదు దుస్తులపై పడిన గ్రీజు వంటి మరకలను కూడా తొలగించడంలో కోలా డ్రింక్స్ బాగా పనిచేస్తాయి.

లోహపు వస్తువులకు పట్టే తుప్పును వదిలించడంలో కూడా ఈ డ్రింక్స్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

కార్ బ్యాటరీ టర్మినల్స్ పై కోలా డ్రింక్స్ ను పోసి వాటిని శుభ్రం చేసుకోవచ్చు.

లోహపు వస్తువులకు పడిన పెయింట్ మరకలను తొలగించుకోవాలంటే కోలా డ్రింక్స్ ను వాడవచ్చు

వంటగది – బాత్ రూంలలో ఉండే టైల్స్ ను కోలా డ్రింక్స్ తో శుభ్రం చేసుకోవచ్చు.

హెయిర్ డైని తొలగించుకోవాలన్నా కోలా డ్రింక్స్ ను ఉపయోగించవచ్చు. పింగాణీ వస్తువులను, కార్పెట్లను శుభ్రం చేయటానికి కూడా ఉపయోగించవచ్చు.

ఫ్రై వంటి వంటకాలను చేసినప్పుడు మూకుడు, పాన్ వంటివి మాడిపోతుంటాయి. అలా మాడిన పదార్థాన్ని తొలగించటానికి కోలా డ్రింక్స్ బాగా సహాయపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.