Beauty Tips

Charcoal Benefits :బొగ్గే కదా అని పారేయకండి… దీని గురించి తెలిస్తే మీరు అసలు వదిలిపెట్టరు

Charcoal Benefits :బొగ్గే కదా అని పారేయకండి… దీని గురించి తెలిస్తే మీరు అసలు వదిలిపెట్టరు.. నల్లగా ఉండే బొగ్గుని చూస్తే చాలా మందికి చాలా చిరాకుగా ఉంటుంది. కానీ బొగ్గులో ఎన్నో బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

వాటి గురించి తెలుసుకుంటే మీరు చాలా ఆశ్చర్యపోతారు. అంతేకాక బొగ్గుని ఉపయోగిస్తారు. బొగ్గుతో పేస్ ప్యాక్ వేసుకోవచ్చు. బొగ్గును మెత్తని పొడిగా చేసి నీటిని కలిపి పేస్ట్ గా చేయాలి.

ఈ పేస్ట్ ని ముఖానికి రాసి ఆరాక ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే ముఖ కాంతి పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో వాతావరణంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది.

ఈ కాలుష్యం కారణంగా ముఖం మీద రంద్రాలు పెద్దవిగా కనిపించి ముఖం కాస్త అసహ్యంగా కన్పిస్తుంది. దాంతో చాలా మంది ఆందోళనకు గురి అయ్యి వేలు ఖర్చు పెట్టి బ్యూటీపార్లర్ చుట్టూ తిరుగుతారు.

ఆలా బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగకుండా మనం వాడే ఫేక్ ప్యాక్ లో కొంచెం బొగ్గు పొడి కలిపి ప్యాక్ ముఖానికి వేసుకుంటే ముఖ చర్మంలో మృతకణాలు మరియు మురికి తొలగిపోతుంది. ముఖం మీద చెమట,జిడ్డు అనేవి ఒక పట్టాన వదలవు. దీని కోసం ఎన్నో క్రీములు వాడుతూ, వైద్యులు చుట్టూ, పార్లర్ల చుట్టూ తిరుగుతారు.

కాని ఇలాంటివారు బొగ్గు మాస్క్‌ను ఉపయోగిస్తే అతిగా చర్మం నుంచి విడుదలవుతున్న నూనెలు తొలగిపోతాయట. ఇలా చేస్తే కచ్చితంగా చర్మం మృదువుగా కనిపిస్తుందని అంటున్నారు. ఇలా చేస్తే సహజనూనెలు కోల్పోకుండా ఉంటాయని చెప్తున్నారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.