Healthhealth tips in telugu

Pineapple in Summer: సమ్మర్‌లో పైనాపిల్ తింటే ఇన్ని లాభాలా..

Pineapple in Summer: సమ్మర్‌లో పైనాపిల్ తింటే ఇన్ని లాభాలా.. అనాసను ఇంగీష్ లో పైన్ ఆపిల్ అని అంటారు. బ్రొమేలియా జాతికి చెందిన అనాస శాస్త్రీయ నామం ఎకోమోసస్‌.మనకు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన పండ్లలో అనాస పండు ఒకటి. అనాస ఒక రకమైన పండ్ల చెట్టు. ఇది దక్షిణ అమెరికాలోని ఫిలిప్పైన్స్‌లో పుట్టింది. అయితే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో పెరుగుతుంది.

భారతదేశంలోకి ఇది 1548 సంవత్సరంలో ప్రవేశించింది.పుల్లగా తియ్యగా ఉండే పైనాపిల్‌లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలు మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి. విటమిన్ సి సమృద్ధిగా ఉండే అనాస పండును ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.గది ఉష్ణోగ్రత వద్ద అనాస పండు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు.

అనాస పండు ఫ్రిజ్ లో జ్యుస్ రూపంలో కన్నా ముక్కల రూపంలో రెండు రోజులు నిల్వ ఉంటుంది. అది కూడా గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి. ఏది ఏమైనా అనాస పండును తాజాగా తింటేనే మంచిది. పైనాపిల్ చూడడానికి ముళ్లులాగా ఉండి ఆకారం బాగోకపోయిన దానిలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయని నిపుణులు చెప్పుతున్నారు.

పైనాపిల్ ని ముక్కల రూపంలో లేదా జ్యుస్ రూపంలో గాని తీసుకోవచ్చు. ఈ మధ్య డ్రై పైనాపిల్ కూడా సూపర్ మర్కెట్స్ మరియు డ్రై ఫ్రూట్ షాప్ లో అందుబాటులో ఉంటున్నాయి. ఇప్పుడు అనాస పండులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. పచ్చకామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధులున్నవారు రెగ్యులర్ గా కొన్ని రోజుల పాటు అనాస జ్యుస్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఆడవారిలో నెలసరి సక్రమంగా వచ్చేందుకు చాలా సహాయపడుతుంది. అనాస పండులో ఎక్కువగా పీచు పదార్ధం ఉండుట వలన మలబద్దకం, అజీర్ణం,కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధ సమస్యలు అన్ని తొలగిపోతాయి. పైనాపిల్‌లో బ్రొమిలైన్‌అనే ప్రొటియోలిటిక్‌ ఎంజైమ్‌ ఉండుట వలన తీసుకున్న ఆహారాన్ని ప్రొటీన్లుగా జీర్ణం చేస్తుంది.  

అందుకే అజీర్తికి అనాసపండు  మంచి మందు.అనాస పండులో కొన్నిరకాల ఎంజైమ్స్ ఉండుట వలన తక్షణ శక్తి వచ్చి అలసట వంటివి లేకుండా చేస్తుంది. ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది. ముఖ్యంగా పెరిగే చిన్న పిల్లలు మరియు ముసలివారిలో ఎముకలకు సంబందించిన సమస్యలు రాకుండా బలంగా,దృడంగా ఉంటాయి. వయస్సు రీత్యా వచ్చే కంటి సమస్యలను తగ్గించటంలో సహాయపడుతుంది.

అలాగే క్యాన్సర్ కారకాలు శరీరం మీద ప్రభావం చూపకుండా చేస్తుంది. అనాసలో విటమిన్ సి ఉండుట వలన చిగుళ్ల సమస్యలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. పళ్ళ నుండి రక్తంకారే స్కర్వే వ్యాధి రాకుండా రక్షణ ఇస్తుంది. అనాస పండు రసాన్ని గొంతులో పోసుకుని పుక్కిలిస్తే గొంతునొప్పి, టాన్సిల్స్‌ నివారణ అవుతాయి.అంతేకాక శ్వాస సంబంధ సమస్యలు అయినా బ్రాంకైటిస్‌ వంటి వాటిని తగ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.