Healthhealth tips in telugu

Lifestyle: ఉదయం లేవగానే కడుపుబ్బరంగా ఉంటుందా.?

Lifestyle: ఉదయం లేవగానే కడుపుబ్బరంగా ఉంటుందా… ఈ మధ్య మారిన జీవనశైలి పరిస్థితి మరియు జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం వంటి అనేక రకాల కారణాలతో గ్యాస్,ఎసిడిటీ,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు రాగానే అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోయిన ఇటువంటి సమస్యలు వస్తాయి.

యాలకులు గ్యాస్,కడుపు ఉబ్బరం,కడుపులో మంట వంటి పొట్టకు సంబందించిన అన్నీ రకాల సమస్యలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. గ్యాస్ సమస్యగా ఉన్నప్పుడు రెండు యాలకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి తాగాలి. లేదా రెండు యాలకులను రాత్రి సమయంలో నీటిలో వేసి అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడకట్టి తాగాలి.

పసుపును రెగ్యులర్ గా తీసుకుంటే గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు అసలు ఉండవు. ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో పావు స్పూన్ పసుపు కలిపి తాగాలి. పసుపు కొమ్ములను తెచ్చుకొని ఆడించుకున్న పసుపును వాడాలి. పసుపులో ఉన్న యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీవైరల్ లక్షణాలు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి.

జీలకర్ర పొట్టకు సంబందించిన సమస్యలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. అరస్పూన్ జీలకర్ర నీటిలో వేసి మరిగించి వడకట్టి తేనె కలుపుకొని తాగవచ్చు. జీలకర్ర బరువు తగ్గించటానికి కూడా బాగా సహాయపడుతుంది. జీలకర్రలో ఉన్న లక్షణాలు గ్యాస్ సమస్యను తగ్గించటానికి చాలా బాగా సహాయపడతాయి.

వెల్లుల్లి కూడా జీర్ణ సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలో ప్రీబయోటిక్స్ ఉండుట వలన ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. గ్యాస్ మరియు మలబద్ధకం వంటి వివిధ గ్యాస్ట్రిక్ సమస్యల చికిత్సకు వెల్లుల్లి సహాయపడుతుంది. వెల్లుల్లిని పచ్చిగా తింటే గ్యాస్ సమస్య పెరిగే అవకాశం ఉంది. అందువల్ల వెల్లుల్లిని నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగటం మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.