Healthhealth tips in telugu

Tips To Reduce Uric Acid:పరగడుపున ఈ టీ తాగితే..యూరిక్ యాసిడ్ తొలగిపోతుంది

Tips To Reduce Uric Acid:పరగడుపున ఈ టీ తాగితే..యూరిక్ యాసిడ్ తొలగిపోతుంది.. యూరిక్ యాసిడ్ సమస్య వచ్చినపుడు అసలు అశ్రద్ద చేయకూడదు. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే ఎన్నో సమస్యలు వస్తాయి. కొన్ని ఆహారాలను తీసుకోని యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు.

ఈ మధ్యకాలంలో చాలామంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. కిడ్నీలు యూరిక్ యాసిడ్ ని బయటకు పంపించ లేకపోతే మన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. ఇలా యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు అనేక రకాల సమస్యలు వస్తాయి. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే కొన్ని ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు.

యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి. డాక్టర్ చెప్పిన ప్రకారం మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే చాలా తొందరగా యూరిక్ యాసిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు. యూరిక్ యాసిడ్ అనేది మన శరీరం సహజంగా విసర్జించే వ్యర్థ పదార్థాలలో ఒకటి. .

మనం తీసుకునే ఆహారంలో ప్యూరిన్ అనే రసాయనం విచ్ఛిన్నం అయినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇది ఎప్పటికప్పుడు మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అలా విసర్జన సరిగ్గా జరగకపోతే ఈ యూరిక్ యాసిడ్ అనేది రక్తంలో నిలిచిపోయి స్పటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోయి కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలు వస్తాయి.

అలాగే గుండెకు సంబంధించిన సమస్యలు, కిడ్నీ సమస్యలు, డయాబెటిస్ వంటి అనేక రకాల సమస్యలు వస్తాయి. సాధారణంగా పురుషులలో 3.4-7.0 mg వరకు యూరిక్ యాసిడ్, మహిళల్లో 2.4- 6.0 mg వరకు యూరిక్‌ యాసిడ్‌‌ ఉంటే ఎటువంటి ప్రమాదం ఉండదు. యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించటానికి గ్రీన్ టీ సహాయపడుతుంది.

మనలో చాలా మంది బరువు తగ్గడానికి గ్రీన్‌ టీ తాగుతూ ఉంటారు. గ్రీన్‌ టీలో ఉండే.. యాంటీఆక్సిడెంట్స్‌, బయోయాక్టివ్ కాంపౌండ్స్‌ యూరిక్‌ యాసిడ్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఉదయం సమయంలో ఒకసారి తాగితే సరిపోతుంది. ప్రతిరోజూ గ్రీన్‌ టీ తాగితే శరీరంలోని వ్యర్థ పదార్థాలు తొలగుతాయి. గ్రీన్‌ టీ రోగనిరోధక శక్తి మెరుగుపరుస్తుంది.

ఇది కూడా చదవండి: Facts About palak Paneer:పాలక్ పనీర్ ఎక్కువగా తింటున్నారా…ఈ విషయం తెలుసుకోండి

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.