Kitchenvantalu

Turmeric Powder: ప్రతి రోజు వాడే పసుపు అసలుదా..? నకిలీదా..? ఈ సింపుల్ ట్రిక్‌తో తెలుసుకోండి

Turmeric Powder: ప్రతి రోజు వాడే పసుపు అసలుదా..? నకిలీదా..? ఈ సింపుల్ ట్రిక్‌తో తెలుసుకోండి.. మనం ప్రతి రోజు వంటింటిలో పసుపు వాడుతూ ఉంటాం. కూరల్లో పసుపు వేస్తే కూరకు రుచి రావటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పసుపును మార్కెట్ లో కొనకుండా పసుపు కొమ్ములను పొడిగా ఇంటిలోనే చేసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు.

అయితే మనలో చాలా మంది పసుపును మార్కెట్ లో కొంటూ ఉంటారు. అలా మార్కెట్ లో కొన్నప్పుడు కల్తీ జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పే చిట్కాల ద్వారా పసుపు అసలుదా..? నకిలీదా..అనేది చాలా సులభంగా తెలుసుకోవచ్చు.

ఒక బౌల్ లో పసుపు వేసి నీటిని కలిపి పేస్ట్ గా చేయాలి. దీనిలో కొంచెం హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేస్తే…బుడగలు వస్తే సబ్బు పొడి లేదా సుద్ద పొడి కలిపినట్టు అర్ధం చేసుకోవాలి.

ఒక గ్లాసులో కొంచెం గోరువెచ్చని నీటిని తీసుకుని దానిపై అర టీస్పూన్ పసుపు వేయండి. కదపకుండా అరగంట అలా ఉంచాలి. పసుపు పొడి అంతా గ్లాసు అడుగున స్థిరపడి, నీరు స్ఫటికంలా స్పష్టంగా ఉంటే, పసుపు స్వచ్ఛమైనది. నీరు మబ్బుగా మారినట్లు అనిపిస్తే, అది కల్తీ అని అర్థం.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.