Kitchenvantalu

Soft Chapati Tips:ఈ టెక్నిక్స్ పాటిస్తే.. ఎవరు చేసినా చపాతీలు మెత్తగా వస్తాయి!

Soft Chapati Tips:ఈ టెక్నిక్స్ పాటిస్తే.. ఎవరు చేసినా చపాతీలు మెత్తగా వస్తాయి.. ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చపాతీ తింటున్నారు . చపాతీ మృదువుగా ఉంటే తినటానికి ఇష్టంగా ఉంటుంది.

ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది బరువు తగ్గటానికి మరియు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందటానికి చపాతీలను తింటున్నారు. చపాతీలను చేసే సమయంలో సరైన శ్రద్ద లేకపోతే చపాతీలు గట్టిగా మారి తింటూ ఉంటే దవడలు నొప్పి వస్తాయి. అలా కాకుండా చపాతీలు మృదువుగా మెత్తగా రావాలంటే ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే సరిపోతుంది.

పిండి కలిపే సమయంలో గోరువెచ్చని పాలను పోయాలి. చపాతీ పిండి మృదువుగా ఉండాలంటే…చపాతీ కోసం గోధుమ పిండిని కలిపినప్పుడు 6:4 నిష్పత్తిలో నీటిని-పాలను పోయాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, అరస్పూన్ పంచదార వేసి కలిపి గంట పాటు అలా వదిలేయాలి. గంట తర్వాత చపాతీ చేస్తే చాలా మృదువుగా మెత్తగా వస్తాయి.

చపాతీలు చేసే సమయంలో చాలామంది పొడి పిండిని వాడుతుంటారు. ఈ పిండి వాడకాన్ని ఎంత తగ్గిస్తే అంతగా చపాతీలు మెత్తగా వస్తాయి. చపాతీలు మృదువుగా వుండి పొంగాలంటే గోధుమ పిండిలో కాస్త పెరుగు లేదా మజ్జిగ కూడా కలపవచ్చు. మజ్జిగ లేదా పెరుగు కలిపినప్పుడు పాలను కలపకూడదు. ఈ చిట్కా పాటిస్తే చపాతీలు చాలా సమయం వరకు మెత్తగా,మృదువుగా ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.