Kitchenvantalu

Cooking Tips: ఈవిధంగా వండితే కాకరకాయ చేదు ఉండదు..ఆ కిచెన్ సీక్రెట్ తెలుసుకోండి

Cooking Tips: ఈవిధంగా వండితే కాకరకాయ చేదు ఉండదు..ఆ కిచెన్ సీక్రెట్ తెలుసుకోండి.. కాకరకాయ పేరు వినగానే మన అందరికీ చేదు గుర్తుకొస్తుంది. కాకరకాయ చేదు కారణంగా తినటానికి చాలామంది ఇష్టపడరు.

కాకరకాయలో విటమిన్‌ ఎ, సి, ఇ, బి1, బి2, బి3, బి9, పొటాషియం, కాల్షియం, జింక్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌… వంటి మినర్ల్స్‌. కెటెచిన్‌, గాలిక్‌ యాసిడ్‌, ఎపికెటెచిన్‌, క్లోరోజెనిక్‌ యాసిడ్‌… వంటి యాంటీఆక్సిడెంట్ లు పుష్కలంగా ఉంటాయి.

కాకరకాయను తరచుగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కొంతమంది కాకరకాయతో వేపుడు, పులుసు వంటివి చేసుకుంటారు. మరి కొంత మంది కాకరకాయలను ముక్కలుగా కోసి ఎండబెట్టి కారం పొడి చేస్తారు. మరి కొంతమంది వడియాలు, చిప్స్ వంటివి చేస్తూ ఉంటారు. కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే కాకరకాయ చేదును తగ్గించవచ్చు.

కాకరకాయ పులుసు, కూర చేసినప్పుడు చిన్న బెల్లం ముక్క వేస్తే కాకరకాయ చేదును తగ్గిస్తుంది. అలాగే కూర చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయను చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి పెరుగు వేసి బాగా కలిపి ఒక గంట సేపు నానబెట్టాలి. ఈ విధంగా చేయడం వలన పెరుగులో ఉన్న లక్షణాలు కాకరకాయ చేదును తగ్గిస్తాయి.

కాకరకాయ కూర ఉడికిన తర్వాత చివరిలో నిమ్మరసం కలిపితే కాకరకాయ చేదు తగ్గడమే కాకుండా కూర చాలా రుచిగా ఉంటుంది. నిమ్మకాయలో ఉండే పులుపు కాకర చేదును తగ్గించడానికి సహాయపడుతుంది.

కాకరకాయ పై తొక్క ఎక్కువ చేదును కలిగి ఉంటుంది. దాంతో ముందుగా పై పొట్టును తొలగించాలి. అయితే మనలో చాలామంది తొక్కతో పాటు కాకరకాయను తింటూ ఉంటారు. ఇలా పై పొట్టు తీసేస్తే చేదు తగ్గుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.