Healthhealth tips in telugu

Bottle Guard: పొట్ట కొవ్వును ఐస్ లా కరిగించే జ్యూస్ ఇదీ.. రోజూ ఒక్క గ్లాసు తాగితే ఏం జరుగుతుందంటే..!

Bottle Guard: పొట్ట కొవ్వును ఐస్ లా కరిగించే జ్యూస్ ఇదీ.. రోజూ ఒక్క గ్లాసు తాగితే ఏం జరుగుతుందంటే.. సొరకాయతో రకరకాల వంటకాలు చేసుకుంటూ ఉంటాం. అయితే సొరకాయలో ఉన్న ప్రయోజనాల గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఇందులో దాదాపుగా 96 శాతం నీరు ఉంటుంది.సొరకాయతో juice చేసుకొని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

చిన్న కప్పు సొరకాయ ముక్కలను మిక్సీ చేసి జ్యూస్ గా తీసుకోవాలి. దానిలో రెండు టేబుల్ స్పూన్ల అల్లం రసం కలిపి ప్రతిరోజు ఉదయం తాగితే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆకలిని తగ్గించి జీర్ణ ప్రక్రియను వేగవంతం చేసి కాలరీలను ఎక్కువగా కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

జీర్ణ ప్రక్రియ బాగా సాగి ఎసిడిటీ కడుపు ఉబ్బరంగా గ్యాస్ వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. దీనిలో జింక్ సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటును నియంత్రణలో ఉండేలా చేసి గుండె పనితీరును మెరుగుపరిచి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

నరాలను రిలాక్స్ చేసి ఒత్తిడి, ఆందోళన తగ్గించి ప్రశాంతత కలిగేలా చేస్తుంది. డయాబెటిస్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. యూరినరీ ఇన్ఫెక్షన్స్‌కి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. యూరిన్‌లో ఉండే యాసిడ్ కంటెంట్‌ని బాలెన్స్ చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ప్రతిరోజు ఒక గ్లాసు సొరకాయ రసంలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తీసుకుంటే యూరినరీ సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

ముఖ్యంగా అధిక బరువు సమస్య ఉన్నవారికి, యూరినరీ ఇన్ఫెక్షన్స్‌ ఉన్నవారికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కాస్త ఓపికగా జ్యూస్ తయారు చేసుకొని తాగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా సమస్యల నుండి బయట పడవచ్చు. అలాగే సొరకాయ కూడా సంవత్సరం పొడవునా లభ్యం అవుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.