Healthhealth tips in telugu

Cranberries: క్రాన్‌బెర్రీస్ మనం ఎందుకు తినాలి? కలిగే ప్రయోజనమేంటి?

Health Benefits of Cranberries : క్రాన్‌బెర్రీస్ మనం ఎందుకు తినాలి? కలిగే ప్రయోజనమేంటి.. మీరు ఎప్పుడైనా ఈ డ్రై ఫ్రూట్ ని చూశారా.. ఇవి క్రాన్బెర్రీస్. ఇవి డ్రై గా మనకు మార్కెట్లో లభ్యం అవుతాయి ఒకప్పుడు ఇవి పెద్దగా మనకు దొరికేవి కాదు.

కానీ ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్ లోనూ ఆన్లైన్ స్టోర్స్ లోనూ రెగ్యులర్ గా అందుబాటులో ఉంటున్నాయి మిగతా డ్రైఫ్రూట్స్ తో పోలిస్తే దీనిలో యాంటీ-ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన అనేక రకాల వ్యాధులతో పోరాటం చేయడానికి సహాయపడుతుంది

క్రాన్బెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్లు మాత్రమే కాకుండా విటమిన్ C, పొటాషియం, జింక్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, భాస్వరం, విటమిన్ B6, విటమిన్ K మరియు విటమిన్ E కూడా ఉన్నాయి. ఇక ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1. శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుతుంది
2. కండరాల తిమ్మిరిని తగ్గించటమే కాకుండా గుండె సమస్యలు లేకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది
3. మలబద్దకం,యూరినరీ ఇన్ ఫెక్షన్,అజీర్ణం,కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది
4. ఎముకలను బలంగా ఉండేలా చేసి కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు లేకుండా చేస్తుంది
5. రక్తహీనత సమస్య లేకుండా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది
6. జుట్టు సమస్యలు,చర్మ సమస్యలు లేకుండా చేస్తుంది
7. రక్తంలో కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. చెడు కొలస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలస్ట్రాల్ ని పెంచుతుంది

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.