Healthhealth tips in telugu

Health Tips:కోట్లు ఖర్చు పెట్టినా నయం కాని రోగాలను చాలా తేలికగా మాయం చేస్తుంది

Health Tips:కోట్లు ఖర్చు పెట్టినా నయం కాని రోగాలను చాలా తేలికగా మాయం చేస్తుంది.. కుకుర్బిటేసి కుటుంబానికి చెందిన బూడిద గుమ్మడి శాస్త్రీయ నామం బెనిన్ కాసా హిస్పీడ. బూడిద గుమ్మడి బూడిద రంగులో ఉండి ముట్టుకుంటే బూడిదగా పొడి రూపంలో రాలుతూ ఉంటుంది.

ఆయుర్వేదంలో ఎక్కువ ఔషధ గుణాలు ఉన్న మొక్కగా దీనికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది. బూడిద గుమ్మడిలో అసలు కొవ్వు ఉండదు. సోడియం, పొటాషియమ్, పిండి పదార్ధాలు,పీచు,మెగ్నీషియం ,క్యాల్షియం ,ఇనుము మరియు విటమిన్ ఎ,సి,డి ఉంటాయి.

గ్యాస్ సమస్య పరిష్కారానికి చాలా బాగా సహాయపడుతుంది. బూడిది గుమ్మడికాయ రసంలో చిటికెడు ఇంగువ వేసి పరగడుపున తాగితే గ్యాస్ సమస్య తగ్గుతుంది.

ఈ రోజుల్లో చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు మలబద్ధకం సమస్య నుంచి బయట పడాలంటే సాయంత్రం సమయంలో బూడిద గుమ్మడి కాయ జ్యూస్ తాగాలి ఈ విధంగా కొన్ని రోజులపాటు తాగితే మలబద్ధకం సమస్య నుంచి బయట పడవచ్చు

బూడిద గుమ్మడికాయ రసంలో కొంచెం బెల్లం కలిపి తీసుకుంటే కిడ్నీలో రాళ్లు పిత్తాశయంలో రాళ్ళు కరిగిపోతాయి ఈ సమస్యలతో బాధపడే వారికి మంచి ఉపశమనం కలుగుతుంది. కాలేయ సమస్యలను తగ్గిస్తుంది కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది

కడుపులో నులిపురుగులు ఉంటే ఆకలి వేయదు ఏమీ తినాలని అనిపించదు అలాంటి సమస్య ఉన్నప్పుడు బూడిద గుమ్మడికాయతో రసం తయారు చేసుకొని తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."